Tirupati Crime: తిరుపతి జిల్లా, బాలాయపల్లి మండలం అక్కసముద్రం గ్రామంలో కానిస్టేబుల్ వేధింపులతో నాగరాజు అనే యువకుడు తీవ్ర మనస్థాపానికి గురై ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన స్థానికంగా కలకలం రేపింది.
కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం, నాగరాజు అదే గ్రామానికి చెందిన పోలీస్ కానిస్టేబుల్ తమ్మిశెట్టి శివప్రసాద్ వద్ద రూ.50 వేల అప్పు తీసుకున్నాడు. ఆ మొత్తాన్ని సకాలంలో చెల్లించలేకపోవడంతో శివప్రసాద్ అతనిపై దురుసుగా ప్రవర్తించి, దూషిస్తూ శారీరకంగా దాడి చేసినట్లు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనతో మానసికంగా కుంగిపోయిన నాగరాజు ఇంటికి వెళ్లి తన తల్లిదండ్రులకు జరిగిన విషయాన్ని వివరించాడు.
Read also: Bihar SDPO Raid: పనిమనిషి కాదు మహారాణి.. ఎస్డీపీఓ ఇంట్లో సోదాల్లో విస్తుపోయే నిజాలు!

Youth falls victim to harassment by constable
Tirupati Crime: బైక్ పై ఈడ్చుకెళ్లి గాయపరిచినట్లు నాగరాజు తల్లి ఆరోపణలు
అనంతరం తల్లి శివప్రసాద్ ను ప్రశ్నించేందుకు వెళ్లిన సమయంలో, నాగరాజు ఇంట్లోనే ఉరివేసుకొని ప్రాణాలు తీసుకున్నాడు. తలుపులు బద్దలు కొట్టి చూడగా అతను ఉరివేసుకొని కనిపించాడు. తన కుమారుడిని బైక్ పై ఈడ్చుకెళ్లి గాయపరిచినట్లు నాగరాజు తల్లి ఆరోపణలు చేసింది. ఈ ఘటన పై కానిస్టేబుల్ శివప్రసాద్ పై నాన్బెయిలబుల్ కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ప్రస్తుతం అతను పరారీలో ఉన్నాడని, త్వరలోనే అరెస్ట్ చేస్తామని వెల్లడించారు. చట్టాన్ని కాపాడాల్సిన పోలీసులే ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ, నాగరాజు మరణానికి కారణమైన కానిస్టేబుల్ శివప్రసాద్ఫై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also:

