Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
కారులో లాయర్‌పై పైశాచికత్వం.. ముగ్గురు నిందితుల అరెస్ట్

కారులో లాయర్‌పై పైశాచికత్వం.. ముగ్గురు నిందితుల అరెస్ట్

వార్త 5 days ago

Pune crime: దేశంలో మరో దారుణ ఘటన జరిగింది. పూణేలో మ్యాట్రిమోనియల్ సైట్ లో పరిచయమైన వ్యక్తితో కలిసి పార్టీకి వెళ్లిన మహిళా లాయర్ పై కదులుతున్న కారులోనే సామూహిక అత్యాచారం చేశారు.

ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. ముగ్గురు నిందితుల్ని అదుపులోకి తీసుకున్నారు. పరారీలో ఉన్న మరో నిందితుడి కోసం గాలిస్తున్నారు.

Read Also : Kavadiguda Spa Center Murder: కవాడిగూడ స్పా సెంటర్‌లో భార్యను హత్య చేసిన భర్త!

 Demonization of a lawyer in a car.. Three accused arrested

Pune crime: బాధితురాలి వివరాలు

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పాట్నాకు చెందిన బాధితురాలు పూణేలో LLB పూర్తి చేసి.. ముంబై హైకోర్టులో లాయర్ గా ప్రాక్టీస్ చేస్తోంది. పనిపై పూణేకు వచ్చిన ఆమె.. గత ఆదివారం అక్కడే ఉన్నారు. ఒక మ్యాట్రిమోనియల్ వెబ్ సైట్ ద్వారా పరిచయమైన వ్యక్తిని ఆదివారం సాయంత్రం కోరేగావ్ పార్క్ లోని ఫైవ్ స్టార్ హోటల్ కు రమ్మని పిలిచింది. అతను తనతోపాటు మరో ఇద్దరు మహిళలతో వెళ్లగా.. కొద్దిసేపు మాట్లాడుకుని ముగ్గురూ ఎవరిదారిన వారు వెళ్లిపోయారు.

కారులోనే లైంగిక దాడి

అదే హోటల్ లో ఆదివారం రాత్రి మద్యం సేవించే క్రమంలో.. పక్క టేబుల్ పై ఉన్న మరో ఇద్దరు వ్యక్తులతో ఆమెకు పరిచయం ఏర్పడింది. అంతా కలిసి పబ్ కు వెళ్లాలనుకున్నారు. కారులో వెళ్తుండగా.. నిందితుల్లో ఒకడు కదులుతున్న కారులోనే ఆమెపై లైంగిక దాడికి ఒడిగట్టాడు. అంతేకాకుండా, ప్రయాణంలో నిందితులు తమ మరో ఇద్దరు స్నేహితులకు స్పీకర్‌ఫోన్‌లో కాల్ చేసి మహిళపై అసభ్యకరమైన కామెంట్లు చేశారని, కారులో ఉన్న మిగిలిన వారు కూడా అసభ్య శబ్దాలు చేస్తూ పైశాచిక ఆనందం పొందారని దర్యాప్తు అధికారులు వెల్లడించారు. ఆ తర్వాత బాధిత మహిళ కోరేగావ్ పార్క్ పోలీస్ స్టేషన్‌ లో ఫిర్యాదు చేసింది. ఈ ఘోరంపై పోలీస్ కమిషనర్ అమితేష్ కుమార్ స్పందిస్తూ.. “ఈ కేసును దర్యాప్తు చేస్తున్నాం. ఇప్పటికే ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నాం, మరో నిందితుడిని పట్టుకోవడానికి ప్రత్యేక బృందాలను రంగంలోకి దించాం” అని స్పష్టం చేశారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha