Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
కారును ఢీకొట్టిన టిప్పర్ లారీ.. నలుగురు అక్కడికక్కడే మృతి!

కారును ఢీకొట్టిన టిప్పర్ లారీ.. నలుగురు అక్కడికక్కడే మృతి!

వార్త 2 weeks ago

Rajasthan Road Accident: రాజస్థాన్‌లోని జైపూర్ జిల్లా పరిధిలో ఉన్న జైపూర్-ఫలోడి మెగా హైవేపై గురువారం తెల్లవారుజామున అత్యంత ఘోర రహదారి ప్రమాదం సంభవించింది.

వేగంగా వచ్చిన ఒక డంపర్ లారీ, ఎదురుగా వస్తున్న స్విఫ్ట్ డిజైర్ కారును అత్యంత బలమైన వేగంతో ఢీకొట్టింది. తెల్లవారుజామున సుమారు 5 గంటల సమయంలో మిథ్ది బైపాస్ వద్ద జరిగిన ఈ భీకర ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న నలుగురు వ్యక్తులు తీవ్ర గాయాలతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.

Read Also : KPHB Woman Death: అబార్షన్ మాత్రలు వికటించి యువతి మృతి.. ప్రియుడు అరెస్ట్

 Tipper lorry rams into car; four die on the spot!

Rajasthan Road Accident: మృతుల్లో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు

సమాచారం అందుకున్న పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం, ఈ ప్రమాదంలో మృతి చెందిన నలుగురు వ్యక్తులు జుంజును జిల్లాకు చెందినవారిగా ప్రాథమికంగా గుర్తించారు. మృతులో శీతల్ రాజ్‌పుత్, తులసి, లక్ష్మణ్ సింగ్, రామ్‌కిషన్ మేఘ్వాల్ (కారు డ్రైవర్) వీరిలో ముగ్గురు ఒకే కుటుంబానికి చెందినవారు కావడం తీవ్ర విషాదాన్ని నింపింది. వీరంతా సికార్ వైపు నుంచి పాల్డీ గ్రామానికి కారులో ప్రయాణిస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది.

నంబర్ ప్లేట్ లేని అక్రమ డంపర్..

కారును బలంగా ఢీకొట్టిన డంపర్‌లో లాటరైట్ మట్టిని తరలిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఆ డంపర్‌కు ఎలాంటి నంబర్ ప్లేట్ లేకపోవడంతో, అది అక్రమంగా రాకపోకలు సాగిస్తోందంటూ స్థానిక గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రమాద స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. నిందితులపై, అక్రమంగా నడుస్తున్న వాహనాలపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

సింగరేణిలో విషాదం.. వేధింపులు తాళలేక ఇంజనీరింగ్ విద్యార్థిని ఆత్మహత్య

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha