Nara Lokesh Zoom Meeting: ఆంధ్రప్రదేశ్‌లో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ (TDP) విజయకేతనం ఎగురవేసేలా గ్రామ స్థాయి నుండి నాయకులను, కార్యకర్తలను సమన్వయం చేస్తూ సన్నద్ధం చేయాలని టిడిపి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పిలుపునిచ్చారు.
రాష్ట్రవ్యాప్తంగా పార్టీని మరింత పటిష్టం చేసే లక్ష్యంతో శనివారం ఆయన ఒకేసారి 15,000 మంది పార్టీ కన్వీనర్లు, క్లస్టర్ ఇన్‌ఛార్జిలతో భారీ జూమ్ (Zoom) వీడియో కాన్ఫరెన్స్ సమావేశాన్ని నిర్వహించారు.
ఈ సుదీర్ఘ సమీక్షలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా నారా లోకేష్ కేవలం ముగ్గురు నియోజకవర్గాల కన్వీనర్లతో మాత్రమే ప్రత్యేకంగా మాట్లాడారు. అందులో విజయనగరం జిల్లా గజపతినగరం, తూర్పుగోదావరి జిల్లా రాజోలు నియోజకవర్గాలతో పాటు అనంతపురం జిల్లా గుంతకల్ నియోజకవర్గానికి చెందిన గుత్తి పార్టీ కన్వీనర్ కే.ఎం. చౌదరి కి ఆ అరుదైన అవకాశం లభించింది.
కార్యకర్తల ఆకాంక్షలు తెలుసుకుని.. సమన్వయంతో సాగాలి
జూమ్ మీటింగ్‌లో గుత్తి కన్వీనర్ కే.ఎం. చౌదరితో నారా లోకేష్ ప్రత్యేకంగా ముచ్చటించారు. నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి తీసుకుంటున్న చర్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ.. “పార్టీలో దశాబ్దాలుగా ఉన్న సీనియర్ నాయకులను, క్షేత్రస్థాయిలో పార్టీ కోసం రాత్రింబవళ్లు కష్టపడే యువ కార్యకర్తలను ఒక తాటిపైకి తెచ్చి సమన్వయం చేయాల్సిన బాధ్యత కన్వీనర్లపై ఉంది. కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు, క్షేత్రస్థాయిలో ఇంకా ప్రజల ఆకాంక్షలు ఏమున్నాయో నిరంతరం తెలుసుకోవాలి” అని దిశా నిర్దేశం చేశారు. పార్టీ కోసం ప్రాణాలర్పించి పనిచేసే ప్రతి ఒక్క కార్యకర్తకు భవిష్యత్తులో ఖచ్చితంగా తగిన గుర్తింపు, న్యాయం లభిస్తుందని భరోసా ఇచ్చారు.
Read Also : సీఎం చంద్రబాబును కలిసిన అపోలో ప్రీతారెడ్డి
మహానాడు వేళ.. సీనియర్లకు ఘన సన్మానం
నారా లోకేష్ అడిగిన వివరాలపై గుత్తి కన్వీనర్ కే.ఎం. చౌదరి సానుకూలంగా స్పందిస్తూ నియోజకవర్గ పార్టీ కార్యాచరణను వివరించారు. ఈ నెల మే 27, 28 తేదీలలో అత్యంత ప్రతిష్టాత్మకంగా జరగనున్న టిడిపి ‘మహానాడు’ (Mahanadu) కార్యక్రమాన్ని పురస్కరించుకుని గుత్తిలో ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. పార్టీ ఆవిర్భావం (1982) నాటి నుండి నేటివరకు పార్టీ అభ్యున్నతికై, జెండా రక్షణకై నిరంతరాయంగా కృషి చేస్తున్న 9 మంది సీనియర్ మోస్ట్ కార్యకర్తలను గుర్తించి, వారిని మహానాడు వేదికపై ఘనంగా సన్మానిస్తున్నట్లు లోకేష్‌కు వివరించారు.
Nara Lokesh Holds Massive Zoom Meeting with 15,000 Participants
బక్రీద్ వేళ ముస్లిం మైనార్టీలకు చేయూత
రాబోయే ముస్లింల పర్వదినం బక్రీద్ (Bakrid) ను పురస్కరించుకుని, గుంతకల్ నియోజకవర్గంలోని టిడిపి ముస్లిం మైనార్టీ నేతలను ప్రత్యేకంగా సత్కరించనున్నట్లు చౌదరి పేర్కొన్నారు. అలాగే పండుగ కానుకగా ఆర్థికంగా వెనుకబడిన పలు పేద ముస్లిం కుటుంబాలను గుర్తించి, పండుగను సంతోషంగా జరుపుకునేలా తమ వంతుగా ఆర్థిక చేయూతను అందజేయనున్నట్లు నారా లోకేష్‌కు వివరించగా, ఆయన ఈ సేవా కార్యక్రమాలను ప్రత్యేకంగా అభినందించారు.
Nara Lokesh Zoom Meeting: ఎమ్మెల్యే జయరాం ఆధ్వర్యంలో పార్టీ బలోపేతం
గుంతకల్ నియోజకవర్గ ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం (MLA Gummanur Jayaram) ఆశీస్సులు, నాయకత్వంలో మరియు గుమ్మనూర్ ఈశ్వర్ ప్రత్యక్ష పర్యవేక్షణలో నియోజకవర్గవ్యాప్తంగా పార్టీ అభివృద్ధికి, రాబోయే లోకల్ బాడీ ఎన్నికల సమరానికి అన్ని విధాలా తగు వ్యూహాత్మక చర్యలు చేపట్టామని కన్వీనర్ చౌదరి జూమ్ మీటింగ్‌లో వివరించారు.
రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన ఈ భారీ జూమ్ సమావేశంలో నారా లోకేష్ కేవలం ముగ్గురితోనే మాట్లాడగా, అందులో ఉమ్మడి అనంతపురం జిల్లా నుండి కేవలం గుత్తి కన్వీనర్ చౌదరికే ఆ అవకాశం లభించడం పట్ల నియోజకవర్గ టిడిపి శ్రేణులు, నాయకులు హర్షం వ్యక్తం చేశారు. రాబోయే స్థానిక ఎన్నికల నేపథ్యంలో లోకేష్ బాబు గుంతకల్ నియోజకవర్గానికి, ఇక్కడి క్యాడర్‌కు ఎంతటి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నారో ఈ ఘటనే నిదర్శనమని పార్టీ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also :

