Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
లోకేష్ పై అంబటి ఫైర్

లోకేష్ పై అంబటి ఫైర్

వార్త 3 months ago

Ambati Rambabu Comments on Lokesh : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అధికార, ప్రతిపక్ష నేతల మధ్య మాటల యుద్ధం మరోసారి ముదిరింది. వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ఉద్దేశించి మంత్రి నారా లోకేష్ చేసిన 'బెంతాహై' అనే వ్యాఖ్యలపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

లోకేష్‌ను నేరుగా ట్యాగ్ చేస్తూ సోషల్ మీడియా వేదికగా ఆయన ఘాటైన కౌంటర్ ఇచ్చారు. “బెంతాహై సంగతి దేవుడెరుగు.. తెలుగు సరిగా ఉచ్చరించకపోతే జనం నిన్ను తంతాహై!” అంటూ అంబటి రాంబాబు వ్యంగ్యంగా ట్వీట్ చేశారు. లోకేష్ గతంలో చేసిన కొన్ని తెలుగు ఉచ్చారణ లోపాలను గుర్తు చేస్తూ అంబటి చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి.

Read Also : సీఎం చంద్రబాబును కలిసిన అపోలో ప్రీతారెడ్డి

‘బెంతాహై’ చుట్టూ పొలిటికల్ రచ్చ

ఈ ట్వీట్ రేపిన దుమారంతో తెలుగుదేశం (TDP), వైఎస్సార్ కాంగ్రెస్ (YCP) పార్టీల సానుభూతిపరులు, సోషల్ మీడియా శ్రేణులు పరస్పర విమర్శలకు దిగాయి. మంత్రి లోకేష్ ఉపయోగించిన ‘బెంతాహై’ అనే పదం అసలు అర్థం ఏమిటనే దానిపై ఒకవైపు చర్చ జరుగుతుండగా, మరోవైపు రెండు పార్టీల ఐటీ విభాగాలు కౌంటర్ పోస్టులతో సోషల్ మీడియాను హీటెక్కిస్తున్నాయి. గతంలో లోకేష్ మాట్లాడిన కొన్ని వీడియో క్లిప్పింగులను వైసీపీ శ్రేణులు ట్రోల్ చేస్తుండగా, దానికి బదులుగా టీడీపీ శ్రేణులు కూడా అంబటి రాంబాబుపై పాత విషయాలను ప్రస్తావిస్తూ పోస్టులు పెడుతున్నారు. మొత్తానికి, ‘బెంతాహై’ అనే ఒక్క పదం ఏపీ రాజకీయాల్లో ఇరుపక్షాల మధ్య సరికొత్త డిజిటల్ యుద్ధానికి దారితీసింది.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also :

ఆంధ్రప్రదేశ్‌కు వచ్చే మూడు రోజుల్లో భారీ వర్షాలు..ఐఎండీ

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha