Dailyhunt
కాశీబుగ్గ జువెలరీ షాప్ లో జరిగిన డెకాయిటీ గ్యాంగ్ అరెస్టు

కాశీబుగ్గ జువెలరీ షాప్ లో జరిగిన డెకాయిటీ గ్యాంగ్ అరెస్టు

వార్త 1 week ago

Srikakulam: శ్రీకాకుళం, మే 02.కాశీబుగ్గ పోలీస్ స్టేషన్ పరిధిలోని కాశీబుగ్గ పట్టణం నిత్యానందనగర్‌లో ఉన్న శ్రీ వెంకటేశ్వర జువెలరీ షాప్ లో జరిగిన డెకాయిటీ కేసును కాశీబుగ్గ పోలీసులు విజయవంతంగా ఛేదించి, నిందితులను అరెస్ట్ చేసి, కేసుకు సంబంధించిన ముఖ్యమైన సొత్తును స్వాధీనం చేసినట్లు శనివారం జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన పత్రిక సమావేశంలో కేసు వివరాలను జిల్లా ఎస్పీ శ్రీ కేవీ మహేశ్వర్ రెడ్డి వెల్లడించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ఈ కేసులో దోపిడి అయిన సొత్తు సుమారు 800 గ్రాముల బంగారు ఆభరణాలు,రికవరీ చేసిన సొత్తు 243 గ్రాముల బంగారు ఆభరణాలు పాటుగా 9 mm పిస్టల్ & 5 కార్ట్రిడ్జులు ,7.65 mm పిస్టల్, 2 మ్యాగజైన్లు & 11 కార్ట్రిడ్జులు,నగదు రూ. 3,41,000/- తో పాటుగా దోపిడి చేయబడిన సోత్తుతో కొనుగోలు చేసిన రెండు కార్లును,నేరం చేయడానికి ముందుగా కొనుగోలు చేసిన రెండు కార్లు,మొబైల్ ఫోన్లు - 12,మొత్తం రికవరీ విలువ: రూ. 49,00,000/- లక్షల రూపాయలు ఉంటుందని తెలిపారు. ఈ కేసులో ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన డెకాయిటీ గ్యాంగ్ నిధితులను అరెస్టు కావల్సింది అని,వారి వద్ద నుంచి కేసు ప్రాపర్టీ కూడా స్వాధీనం చేయవలసిందని తెలిపారు.

Read Also: AP student suicide in Chicago: అమెరికాలో కర్నూలు విద్యార్థి ఆత్మహత్య.. కారణం ఇదే!

 Srikakulam: Robbery gang arrested in Kasibugga jewelry shop

అరెస్ట్ చేసిన నిందితులు

A 1 రామచంద్ర సాహు @ బాబు (43 సం.), గంజాం జిల్లా, ఒడిశా.A 2 కునా బరిక్ (36 సం.), గంజాం జిల్లా, ఒడిశా,A 3 బనోజ్ బిహారి పట్నాయక్ (32 సం.), ఖోర్ధా జిల్లా, ఒడిశా,A 4,తపన్ మహారాణా (41 సం.), ఖోర్ధా జిల్లా, ఒడిశా,A 5 పోట్నూరు తిరుమల పాత్రో (56 సం.), కాశీబుగ్గ.

నిందితుల నేర చరిత్ర

A 5 పోట్నూరు తిరుమల పాత్రో అనే వ్యక్తి దొంగ బంగారాన్ని కొనుగోలు చేసి పలు నగదు దుకాణాలకు విక్రయిస్తాడు, ఈ క్రమంలో కాశీబుగ్గలో పలుమార్లు రక్కి చేసి దోపిడికి అనుకూలమైన నగదు దుకాణాన్ని ఎంచుకొని పైన తెలిపిన నిందితులతో దోపిడీ చేయడం జరిగింది. కేసు దర్యాప్తులో, నిందితులు ఒడిశా రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో ఇదే తరహా దోపిడి మరియు డెకాయిటీ నేరాలకు పాల్పడిన అనుభవం కలిగినవారని వెల్లడైంది. వీరి మీద ఇప్పటివరకు ఒడిషా రాష్ట్రంలో 32 కేసులు నమోదైనట్లు గుర్తించబడింది.కొంతమంది నిందితులు ఇప్పటికే అరెస్టై జైలు శిక్ష అనుభవించినట్లు కూడా తేలింది. నేరాలను ప్రణాళికాబద్ధంగా అమలు చేయడం, సాంకేతిక పద్ధతులను వినియోగించడం వీరి ప్రత్యేక లక్షణంగా గుర్తించబడింది.

కేసు సంక్షిప్త వాస్తవాలు

ఫిర్యాది అయిన కిల్లంసెట్టి రామకృష్ణారావు నిత్యానందనగర్‌లో శ్రీ వెంకటేశ్వర జువెలరీ పేరిట బంగారం దుకాణం నిర్వహిస్తున్నారు. ఆయన సాధారణంగా షాప్‌లో ఒక్కడే ఉంటారు.తేదీ 07.04.2026 న మధ్యాహ్నం సుమారు 12:00 గంటల సమయంలో, సుమారు ఏడు మంది వ్యక్తులు, నెంబర్ ప్లేట్లు లేని మూడు మోటార్ సైకిళ్లపై షాప్ వద్దకు వచ్చారు. వారు తమను GST అధికారులుగా చెప్పుకుని షాప్ తనిఖీ చేయాలంటూ లోపలికి ప్రవేశించారు. షాప్‌లోకి వెళ్లిన తరువాత, వారు చేతులకు గ్లౌజులు, ముఖాలకు మాస్కులు ధరించి, అక్కడ ఉన్న సీసీ కెమెరాలపై నల్ల స్ప్రే పిచికారీ చేసి పనిచేయకుండా చేశారు. అనంతరం ఫిర్యాదిదారుడి చేతులకు హ్యాండ్‌కఫ్స్ వేయడంతో పాటు పిస్టల్‌తో బెదిరించి, షాప్‌లో ఉన్న బంగారు ఆభరణాలను దోచుకుని అక్కడి నుండి పరారయ్యారు.

కేసు పూర్వాపరాలు

సదరు బంగారం దుకాణాన్ని దోపిడి చేయాలనే ఉద్దేశంతో, కాశీబుగ్గకు చెందిన A-5 తిరుమల పాత్రో @ హరి, A-2 సహాయంతో గత ఏడాది డిసెంబర్ 25, ఈ సం.లో మార్చి నెలల్లో రెండు సార్లు షాప్‌పై రేకీ నిర్వహించాడు. తరువాత, A-2, A-1 మరియు ఇతర నిందితులను కాశీబుగ్గకు తీసుకువచ్చి, ఆ గోల్డ్ షాప్‌పై మరోసారి రేకీ నిర్వహించారు. ఈ సందర్భంగా, కాశీబుగ్గలో నివసిస్తున్న A-5, షాప్ దోపిడి చేయడానికి అవసరమైన మార్గాలు (రూట్ మ్యాప్) మరియు ఇతర వివరాలను నిందితులకు అందించి సహకరించాడు.ఏప్రిల్ 5న నేరం చేయడానికి ప్రయత్నించినప్పటికీ షాపు వేగంగా మూసివేయడం వలన మరుసటి రోజు ఏప్రిల్ 7వ తేదీన పథకం ప్రకారం నేరం చేశారు.నేరం చేసే సమయంలో, సీసీ కెమెరాలకు చిక్కకుండా ఉండేందుకు, అలాగే టోల్ గేట్ల మార్గాలను తప్పించుకునేందుకు, నిందితులు భువనేశ్వర్ నుండి బయలుదేరి కురుధా, ఆస్కా, దిగబండి, మహేంద్రగిరి, లావణ్యకోట, గండహాతి, గరబండ, గొప్పిలి, పెద్దాంచల, చిన్నాంచల, కేదారిపురం మార్గంగా ప్రయాణించారు.మొత్తం మూడు మోటార్ సైకిళ్లు మరియు ఒక కారులో ప్రయాణించి, ఆ కారును కేదారిపురం గ్రామం సమీపంలోని లేఅవుట్ ప్రాంతంలో నిలిపి, అక్కడి నుండి మోటార్ సైకిళ్లపై కాశీబుగ్గ పట్టణానికి చేరుకున్నారు.తరువాత, ముందుగా రేకీ చేసిన గోల్డ్ షాప్‌లోకి ప్రవేశించి, యజమానికి హ్యాండ్‌కఫ్స్ వేసి, పిస్టల్స్‌తో బెదిరించి, షాప్‌లో ఉన్న బంగారు ఆభరణాలను దోచుకుని అక్కడి నుండి పరారయ్యారు.

కేసు ఛేదన (Detection):

ఈ కేసును ప్రత్యేక నాలుగు పోలీసు బృందాలు సాంకేతిక ఆధారాల సహాయంతో చేదించారు. ఓ బ్యాంకు వద్ద సీసీ కెమెరాల ద్వారా వాహనాలను గుర్తించారు.అనంతరం వాహనాల కొనుగోలు వివరాలు, ఫైనాన్స్ సంస్థలు ఇచ్చిన సమాచారం సేకరించారు. ఆధార్, మొబైల్ నంబర్ల ఆధారంగా నిందితులను గుర్తించారు తద్వారా గ్యాంగ్ యొక్క మొత్తం నెట్వర్క్‌ను వెలికితీసి నిందితులను అరెస్ట్ చేశారు

ప్రతిభకు ప్రశంస

అదనపు ఎస్పీ (క్రైమ్స్) శ్రీ పి. శ్రీనివాసరావు గారి పర్యవేక్షణలో కాశీబుగ్గ సబ్ డివిజనల్ అధికారి టి. భవాని సూచనల మేరకు, ఈ కేసును ఛేదించి నిందితులను పట్టుకోవడంలో క్రియాశీలంగా పనిచేసిన పోలీస్ అధికారులు, సిబ్బందిని జిల్లా ఎస్పీ కెవి మహేశ్వర రెడ్డి గారు ప్రత్యేకంగా అభినందించారు.వై. రామకృష్ణ, ఇన్‌స్పెక్టర్, ఎం. చిన్నన్నాయుడు, ఇన్‌స్పెక్టర్, ఇచ్ఛాపురం,ఆర్. నరసింహమూర్తి, ఎస్సై సునీల్ ఎస్సై, కాశీబుగ్గ పోలీస్ స్టేషన్ కే. మధుసూదనరావు, ఎస్సై, పాతపట్నం పోలీస్ స్టేషన్,రాజేష్ ఎస్సై సీసీఎస్ పోలీస్ స్టేషన్,పి.పారి నాయుడు , కంచిలి ఎస్సై,సి.హెచ్ గంగరాజ , ఎస్సై,
హెచ్‌సీ గవరయ్య,పీసీలు: ఉషాకిరణ్, ఎం. నీలకంఠం, మాధవ్, అలీ, శణ్ముఖరావు, భాసీర్, లోకనాథం, రాధాకృష్ణ, హరీష్. ఐటి కోరే సిబ్బంది హెచ్‌సీ యం. శ్రీధర్ కుమార్, పీసీలు డి.కె.జె భరత్ రెడ్డి. యస్. నరేష్,ఈ కేసు ఛేదనలో క్రియాశీలంగా వ్యవహరించి, సమన్వయం, సాంకేతిక వినియోగం ప్రశంసనీయమని జిల్లా ఎస్పీ గారు పేర్కొన్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

ORRపై ఆగని ప్రమాదాలు: 24 గంటల్లోనే మరో కారు బోల్తా..

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha