Rajahmundry Crime: రాజమండ్రి శివారు ప్రాంతమైన కాతేరు పరిధిలోని గామన్ బ్రిడ్జి సమీపంలో మంగళవారం తెల్లవారుజామున తీవ్ర కలకలం రేగింది. అక్కడి నిర్జన ప్రాంతంలో ఓ యువతి మృతదేహంతో పాటు, తీవ్ర గాయాలతో ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్న ఓ యువకుడిని స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు.
Read Also:Khammam Student Death:ఆర్ఎంపీ వికటించిన ఇంజెక్షన్.. 8వ తరగతి విద్యార్థిని మృతి!
ఘటన వివరాలు
సమాచారం అందుకున్న తక్షణమే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, అపస్మారక స్థితిలో ఉన్న యువకుడిని హుటాహుటిన రాజమండ్రిలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఐసీయూలో అతని పరిస్థితి అత్యంత విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. పోలీసుల ప్రాథమిక విచారణలో యువకుడిని కోటిలింగాలపేటకు చెందిన అభిలాష్‌గా, మృతి చెందిన యువతిని శాంతినగర్ నివాసిగా గుర్తించారు. యువతి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం రాజమండ్రి ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి తరలించారు.
Rajahmundry Crime: విచారణ వేగవంతం చేసిన పోలీసులు
ఈ దుర్ఘటన వెనుక ఉన్న అసలు కారణాలపై పోలీసులు పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ఇది ప్రేమికుల ఆత్మహత్యాయత్నమా లేక మూడో వ్యక్తి ప్రమేయంతో జరిగిన దాడి/హత్య అనే అనుమానాలను పోలీసులు నివృత్తి చేసుకుంటున్నారు. ఇరువైపులా ఉన్న కుటుంబ సభ్యులకు సమాచారం అందించిన పోలీసులు వారి వాంగ్మూలాలను నమోదు చేసుకుంటున్నారు. క్లూస్ టీమ్‌ను రప్పించి ఘటనా స్థలం నుండి ఆధారాలు సేకరించారు. సమగ్ర దర్యాప్తు అనంతరం పూర్తి నిజాలు బయటపడతాయని అధికారులు వెల్లడించారు.
Epaper: epaper.vaartha.com

