Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
కావేరి జలాల వివాదం.. సీఎం విజయ్ ముందున్న తొలి రాజకీయ సవాల్

కావేరి జలాల వివాదం.. సీఎం విజయ్ ముందున్న తొలి రాజకీయ సవాల్

వార్త 4 days ago

CM Vijay: తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన సి. జోసెఫ్ విజయ్‌కు మొదటిసారీ పెద్ద రాజకీయ పరీక్ష ఎదురైంది. దశాబ్దాలుగా ముగింపు లేని కావేరి జలాల పంపిణీ సమస్యపై ఆయన సర్కార్ తీసుకున్న నిర్ణయం రాష్ట్రంలో తీవ్ర దుమారం రేపుతోంది.

ఈ సున్నితమైన అంశంపై చర్చించే నిమిత్తం తక్షణమే అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తుండగా, విజయ్ ప్రభుత్వం ఆ ప్రతిపాదనను తిరస్కరించడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

అఖిలపక్ష సమావేశం డిమాండ్‌ను తోసిపుచ్చిన టీవీకే ప్రభుత్వం

కావేరి అంశంపై వెంటనే అఖిలపక్ష భేటీ నిర్వహించాలని ప్రధాన ప్రతిపక్షం డీఎంకేతో పాటు ఇతర పార్టీలు ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ఒత్తిడి తెస్తున్నాయి. అయితే, టీవీగ వెట్రి కళగం (టీవీకే) ప్రభుత్వం ఈ డిమాండ్‌ను సున్నితంగా తిరస్కరించింది. ప్రతిపక్షాలు రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసం కాకుండా, కేవలం రాజకీయ లబ్ధి కోసమే ఈ వివాదాన్ని మళ్లీ తెరపైకి తెస్తున్నాయని మండిపడింది.

CM Vijay: డీఎంకే కుట్రపూరిత రాజకీయమే – టీవీకే నేత సీటీఆర్ నిర్మల్ కుమార్ విమర్శలు

ఈ వివాదంపై టీవీకే సీనియర్ నేత సీటీఆర్ నిర్మల్ కుమార్ మాట్లాడుతూ.. “ఇప్పటికే శాసనసభలో అన్ని రాజకీయ పార్టీల సంపూర్ణ మద్దతుతో ఏకగ్రీవంగా తీర్మానం చేశాం. అలాంటప్పుడు మళ్లీ అఖిలపక్ష సమావేశం నిర్వహించాల్సిన అవసరం ఏముంది? కేవలం మా ముఖ్యమంత్రికి కావాలనే ఇబ్బందులు సృష్టించాలనే కుట్రతోనే డీఎంకే ఇలా వ్యవహరిస్తోంది తప్ప, వారికి తమిళనాడు సంక్షేమం పట్ల చిత్తశుద్ధి లేదు” అని ధ్వజమెత్తారు.

కర్ణాటక పర్యటన రద్దు – నేడు తంజావూరులో డీఎంకే భారీ నిరసన

గతంలో కావేరి ఉద్రిక్తతలు తలెత్తిన సమయంలో నాటి ప్రభుత్వాలు అఖిలపక్ష భేటీలను ఏర్పాటు చేశాయి. కానీ ప్రస్తుత టీవీకే ప్రభుత్వం మాత్రం వినూత్న వ్యూహంతో ముందుకు వెళ్తోంది. ఈ సమస్య పరిష్కారం కోసం నేరుగా బెంగళూరు వెళ్లి కర్ణాటక ముఖ్యమంత్రితో చర్చలు జరపాలని సీఎం విజయ్ ప్లాన్ చేసినప్పటికీ, అక్కడ నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా ఆ టూర్ రద్దయినట్లు సమాచారం. ప్రభుత్వ వైఖరికి నిరసనగా నేడు తంజావూరు వేదికగా రైతుల సమస్యలు, కావేరి జలాల అంశంపై భారీ నిరసన ప్రదర్శన చేపట్టాలని డీఎంకే నిర్ణయించింది.

ధర్మేంద్ర ప్రధాన్.. నెక్స్ట్ ఏంటి?

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha