Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
కావేరి రావణకాష్టమేనా?

కావేరి రావణకాష్టమేనా?

వార్త 3 weeks ago

Cauvery river waters : రెండు దక్షిణాది రాష్ట్రాల మధ్య కావేరి నదీ జలాల వినియోగ సమస్య మళ్లీ రాజుకుంటోంది. కర్ణాటక తీవ్ర వర్షాభావ పరిస్థితులను ఎదుర్కొంటోంది.ఇదే తరుణంలో తమిళనాడుకు రోజుకి 3,500 క్యూసెక్కుల చొప్పున 4.5 టిఎంసిల నీటిని విడుదల చేయాలని కావేరి జలాల యాజమాన్య ప్రాధికార సంస్థ (సిడబ్ల్యు ఎంఏ), కావేరి జలాల నియంత్రణ కమిటీ (సిడబ్ల్యూ ఆరి)లు ఆదేశించడంతో మళ్లీ ఈ సమస్య వెలుగులోకి వచ్చింది.

ఈ యేడాది సాధారణ వర్షపాతంలో కేవలం 35 శాతం మాత్రమే నమోదైన పరిస్థితులలో కావేరి జలాల విడుదల విషయంలో కర్ణాటక ప్రభుత్వం నసే మిరా అంటోంది. కాగా ఆదివారం కర్ణాటకలో ప్రభుత్వ పక్షాన నిర్వ హించిన అఖిలపక్ష సమావేశంలో కావేరి విషయంలో తమ సొంత ప్రయోజనాలే ముఖ్యమని, వాటిని చట్టపరిధిలోనే నిలబెట్టుకుందామని కర్ణాటక ముఖ్యమంత్రి డికె శివకుమార్ విజ్ఞప్తి చేశారు. జల వివాద పరిష్కారానికి ఈనెల 13న కన్నడ సంఘాలు రాష్ట్ర బంద్కు పిలుపునిచ్చాయి. ఈనేపథ్యంలో ఎలాంటి బంట్లకు పిలుపుని వ్వొద్దని రాజకీయ పార్టీలు కన్నడ సంఘాలను ఆయన కోరారు. తనతో భేటీ అప్పుడే కాదని తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్కు కర్ణాటక సిఎం శివకుమార్ హితవు చె ప్పారు. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని ఎలాంటి విధ్వంసరచన మంచిదికా దని ఉభయ రాష్ట్రాలు తలపోయడం మంచిదే.

 Cauvery river waters

Cauvery river waters : కావేరి జలాశయాల్లో తగినంత నీరు లేదు

కావేరి నది కర్ణాటకలో పుట్టి తమి ళనాడు పుదుచ్చేరి, కేరళ గుండా ప్రవహిస్తుంది. ఇది వందేళ్ల నాటి జగడం. ప్రతి వేసవికి, యేటా వచ్చే నైరుతి రుతుపవనాల వైఫల్యానికి ఈ చిచ్చు రగులుతుంటుంది. కర్ణాటక కావేరి నదిలో చెప్పుకోదగిన జలరాశులేమీలేవు. ఉన్న నీటినిసాగునీటికే కాకుండా కేవలం తాగునీటి చెరువులను నింపేందుకు కాలవల ద్వారా నీటిని పంపిస్తున్నామని ఆ రాష్ట్ర ప్రభు త్వం వివరిస్తోంది. గత యేడాది తమిళనాడుకు 31 టిఎంసిల నీటిని విడుదల చేసింది. ఈ యేడాది కావేరి జలాశయాల్లో తగినంత నీరు లేదు.ఈ కారణం చేత పొరుగు రాష్ట్ర ప్రయోజనాలను పూర్తి స్థాయిలో కాపాడే పరిస్థితి కర్ణాటకకు లేదు. గతంలో ఎప్పుడు కావేరి ఎండి పోయి నీటి సమస్య వచ్చినా బంద్లు, విధ్వంసాలు, రాస్తారోకోలు వంటి కార్యాచరణకు రైతులు పూనుకునే వారు. ఈసారి ఉభయ రాష్ట్రాల మధ్య చిచ్చు రగల కుండా ప్రభుత్వాలు కృషి చేయడం ఆహ్వానించదగిన పరిణామం. కర్ణాటకలోని అఖిల పక్షాలు ప్రధానిని కలవనున్నాయి. ఈ వివాదానికి శాశ్వత పరిష్కారంగా ‘మేకెదాటు’ ప్రాజెక్టును కర్ణాటక ప్రభుత్వం ముందుకు తెచ్చింది. తమిళనాడు ఇంకా రంగంలోకి దిగలేదు. కానీ గతంలోలా కాకుండా ఈసారి ఆయా ప్రభుత్వాల ఆలో చనావైఖరి మారి ఉభయ రాష్ట్ర ప్రయోజనాలకు ఉమ్మడి కార్యాచరణ, సామరస్య చర్చల ద్వారా పరిష్క రించుకో వాలన్న యోచన చేస్తుండడం మంచిదే.

నీటి మట్టాల తగ్గుదల కారణంగా జలజగడాలు

గతంలో ఉద్య మాల వైఖరిఎటూ తేల్చకుండా సమస్యను పెండింగ్లో ఉంచి చప్పున చల్లార్చే తతంగంలా జరిగింది. దానితో సమస్య పరిష్కారం కాదుకదా! ఉభయ రాష్ట్రాల ప్రజలు రైతాంగం మధ్య ఆవేశకావేశాలు మాత్రం చల్లారేవికాదు. అందుకనే అంతరాష్ట్ర నదీజలాల వివాదాల సుడిలో కర్ణాటక, తమిళనాడుల మధ్య భావోద్వేగాలు రేకెత్తడం పరిపాటిగా మారింది. అత్యంత సుదీర్ఘకాలంగా కావేరి జలజగడాలు రావణ కాష్టంలో కాలుతోంది. కావేరి బేసిన్ లో వర్షాభావ పరిస్థితులు, రిజర్వాయర్లలో నీటి మట్టాల తగ్గుదల కారణంగా జలజగడాలు ప్రారంభమవుతున్నా యి. ఏ రాష్ట్ర సమస్య వారిది. ఎవరి ప్రయోజనాలు వారు కాపాడుకోవాలన్న ఆరాటం. ప్రతిసారీ రాజకీయ పార్టీలు, రైతుసంఘాల ఆందోళనలు, బంద్కు పిలుపు న్విడం షరా మామూలే. మళ్లీ ఈసారీ అదే దారిలో ఘర్షణలు పెరిగే పరిస్థితి ఉంది. కావేరి నదిని 2018లో సుప్రీంకోర్టు జాతీయ ఆస్తిగా ప్రకటించి 2రాష్ట్రాలు వాడు కోదగిన వాటాలను ఖరారుచేసింది. ఆ ప్రకారంకర్ణాటకకు 284.75 టిఎంసిలు, తమిళనాడుకు 404.25 టిఎం సిల నీటి వాటాదక్కింది. ఇందులోనే బెంగళూరు తాగు నీటి అవసరాల బాధ్యత కూడాచేపట్టింది.

 Cauvery river waters

కావేరి నీటి పంపకాల తీర్పు

ఐదు రాష్ట్రాల రాజకీయ భావోద్వేగాలను అదుపులో పెట్టుకుని సంయ మనం పాటించి ఒక అవగాహనకువస్తే ఉభయతారకంగా ఉంటుంది. రెండు రాష్ట్ర ప్రభుత్వాల్లోనూ కాంగ్రెస్ పార్టీ భాగస్వామ్యంతో ఉన్నందున ముందుగా ఒక అవగాహనకు రావాలి. రుతుపవనాల అనిశ్చితితోపాటు ఈసారి ఎల్నినో, సూపర్ ఎల్న్ని పరిస్థితులు తారాట్లాడుతుం డగా వర్షపాతంలోటు కనపడుతోంది. మళ్లీ పొరుగు రాష్ట్రాలు జలజగడాల దారి పడుతున్నాయి. దాదాపు రెండు రాష్ట్రాలు సాంప్రదాయ వరినే పండిస్తున్నాయి. ఇది వర్షాధార సాగు దాంతో నీటిమీద ఆధారపడితే తప్ప సాగు, సమ ద్ధి కానేరదు. ఎప్పుడు కావేరి నదీజలాలపై ఆందోళనలు ప్రారంభమైనా ఆస్తినష్టం జరిగేది. వివాదం తారాస్థాయికి చేరేది. ఫలితంగా భారీ అల్లర్లు విధ్వంసం. కానీ ఎన్నడూ శాశ్వత పరిష్కారం దొరికిన దాఖలాలు లేవు. 1991లో కావేరి నీటి పంపకాల తీర్పుల సమయం లో గొడవలు జరిగి, భాషాప్ర యుక్తదాడులు జరిగాయి. 2016 సెప్టెంబరులో సుప్రీంకోర్టు ఆదేశాలమేరకు తమిళ నాడుకు నీటిని విడుదల చేయాల్సి వచ్చినప్పుడు కర్ణాటక లో రైతులు ఆందోళనకు దిగారు. తమిళనాడులో కరువై, సాంబ వంటలకు జులై నెలలో నీరుకావాలి. దాని కోసమే ఆ రాష్ట్రం ఆరాటం, ఈసారైనా ఉభయ రాష్ట్రాలుశాశ్వత పరిష్కారం కోసం ఆలోచించాలి. ఏ ఆందోళనలకు దారి తీస్తాయో తెలియకుండా ఉంది. ఈసారైనా ఉభయ రాష్ట్రాలు శాశ్వత పరిష్కారం కోసం ఆలోచించాలి.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

జూరాలలో విద్యుత్ ఉత్పత్తి ప్రారంభం

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha