Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
కావ్య మారన్ వివాహానికి చంద్రబాబు, లోకేశ్‌ను ఆహ్వానించిన మారన్ కుటుంబం

కావ్య మారన్ వివాహానికి చంద్రబాబు, లోకేశ్‌ను ఆహ్వానించిన మారన్ కుటుంబం

వార్త 1 week ago

Kavya Maran Anirudh Wedding: ప్రముఖ పారిశ్రామికవేత్త, సన్ టీవీ నెట్‌వర్క్ గ్రూప్ ఛైర్మన్ కళానిధి మారన్ తన అర్ధాంగి కావేరి కళానిధితో కలిసి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడితో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు.

తమ కుమార్తె, సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) సిఈఓ కావ్య మారన్, ప్రముఖ క్రేజీ సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్‌ల వివాహ రిసెప్షన్ వేడుకకు హాజరు కావాల్సిందిగా సీఎం చంద్రబాబును వారు సాదరంగా ఆహ్వానించారు.

Anirudh-Kavya Maran Wedding: కావ్య మారన్ వివాహ వేడుకకు కేటీఆర్‌కు ఆహ్వాన పత్రిక

 Maran family invites Chandrababu and Lokesh to Kavya Maran's wedding

Kavya Maran Anirudh Wedding: నవంబరు 21న చెన్నైలో గ్రాండ్ రిసెప్షన్.. ఆహ్వాన పత్రిక అందజేత

తమిళనాడు రాజధాని చెన్నైలో నవంబరు 21న జరగనున్న వైభవపేతమైన వివాహ రిసెప్షన్‌కు సంబంధించిన శుభలేఖను కళానిధి మారన్ దంపతులు ముఖ్యమంత్రికి స్వయంగా అందజేశారు. ఈ ఆత్మీయ భేటీ ఆద్యంతం అత్యంత స్నేహపూర్వక వాతావరణంలో సాగింది.

అనంతరం, కళానిధి మారన్ దంపతులు రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు మరియు విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్‌ను కూడా ప్రత్యేకంగా కలిశారు. లోకేశ్‌కు తమ కుమార్తె వివాహ రిసెప్షన్ ఆహ్వాన పత్రికను అందజేసి వేడుకకు ఖచ్చితంగా రావాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. దక్షణాది వ్యాపార, రాజకీయ రంగాల్లో అగ్రస్థానంలో ఉన్న ప్రముఖుల మధ్య జరిగిన ఈ ఆత్మీయ భేటీ ప్రస్తుతం ప్రాధాన్యత సంతరించుకుంది.

నవంబరు 11న గ్రీస్‌లో పెళ్లి

మరోవైపు, అనిరుధ్ రవిచందర్ మరియు కావ్య మారన్‌ల వివాహ వేడుక నవంబరు 11న ఐరోపా దేశమైన గ్రీస్‌లో అత్యంత వైభవంగా జరగనుందంటూ సోషల్ మీడియాలో కథనాలు తెగ వైరల్ అవుతున్నాయి. అయితే ఈ డెస్టినేషన్ వెడ్డింగ్‌కు సంబంధించి మారన్ కుటుంబం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

Epaper: epaper.vaartha.com

అనిరుధ్‌తో కావ్యా మారన్ పెళ్లి ఫిక్స్‌

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha