Kapu Sanghalu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కాపు సామాజిక వర్గం చుట్టూ తిరిగే సమీకరణాలు ఎప్పుడూ ఆసక్తికరంగానే ఉంటాయి. తాజాగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YCP) సీనియర్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ 'ఎక్స్' (ట్విట్టర్) వేదికగా చేసిన ఒక ట్వీట్ రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతోంది.
“కాపులం.. కలుస్తున్నాం.. కదులుతున్నాం.. కదంతొక్కనున్నాం.. కూటమి ఓటమి వరకు” అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు కాపు సామాజిక వర్గంతో పాటు రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చకు దారితీశాయి. ఇటీవల కాలంలో డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కాపు ఓట్ల విభజన, కూటమికి ఆ సామాజిక వర్గం అండగా నిలవడంపై చేసిన కొన్ని కీలక వ్యాఖ్యల నేపథ్యంలోనే అంబటి రాంబాబు ఈ స్థాయిలో స్పందించినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. కూటమి ప్రభుత్వంపై కాపు సామాజిక వర్గంలో ఉన్న అసంతృప్తిని క్యాష్ చేసుకునేందుకే YCP ఈ వ్యూహాన్ని ఎంచుకుందనే టాక్ వినిపిస్తోంది.
Read Also : బసవతారకం ఆసుపత్రి రజతోత్సవ వేడుకలు.. పాల్గొననున్న చంద్రబాబు

కాపు సంఘాల ఐక్యత – కూటమికి సవాల్‌గా మారనున్న పరిణామాలు?
అంబటి రాంబాబు చేసిన ఈ ట్వీట్ కేవలం ఒక సాధారణ ప్రకటన కాదని, దీని వెనుక కాపు సామాజిక వర్గాన్ని ఒకే తాటిపైకి తెచ్చే పెద్ద స్కెచ్ ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎన్నికల తర్వాత మారుతున్న రాజకీయ సమీకరణాల దృష్ట్యా, కాపు సంఘాలు మళ్లీ యాక్టివ్ అవుతున్న తరుణంలో ఈ వ్యాఖ్యలు రావడం ప్రాధాన్యత సంతరించుకుంది. తెలుగుదేశం-జనసేన-బీజేపీ కూటమిని గద్దె దించడమే లక్ష్యంగా కాపు నేతలంతా ఏకం కాబోతున్నారనే సంకేతాలను అంబటి బలంగా పంపించారు. పవన్ కళ్యాణ్ వైఖరిపై సామాజిక వర్గంలో ఉన్న అంతర్గత విభేదాలను వాడుకుంటూ, రాబోయే రోజుల్లో కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమించేందుకు కాపు సంఘాలు సిద్ధమవుతున్నాయనే చర్చకు ఈ ట్వీట్ మరింత ఆజ్యం పోసింది.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also :

