Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
కదిరిలో జనసేన నేత భైరవ ప్రసాద్ అరాచకం.. భార్య, కూతురిపై దాడి

కదిరిలో జనసేన నేత భైరవ ప్రసాద్ అరాచకం.. భార్య, కూతురిపై దాడి

వార్త 6 days ago

Kadiri Janasena Bhairava Prasad: ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీ సత్యసాయి జిల్లా కదిరి పట్టణంలో ఒక షాకింగ్ ఘటన వెలుగుచూసింది. కదిరి నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్‌చార్జ్ భైరవ ప్రసాద్ తన సొంత కుటుంబంపైనే దాష్టీకానికి దిగారు.

డబ్బు వ్యవహారాలు మరియు కుటుంబ కలహాల నేపథ్యంలో ఇంట్లో చెలరేగిన వివాదం కాస్తా భౌతిక దాడికి దారితీసింది. భైరవ ప్రసాద్ తన భార్య శశికళ, 20 ఏళ్ల కుమార్తె వర్షిణిపై తీవ్రంగా దాడి చేసి గాయపరిచారు. ఈ క్రమంలో “ఆడపిల్లను ఎందుకు కన్నావు” అంటూ వారిని తీవ్రంగా దూషిస్తూ, శారీరకంగా అమానుషంగా హింసించినట్లు బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు.

Kadiri Janasena Bhairava Prasad:కదిరి జనసేన ఇన్‌చార్జ్‌పై పోలీసుల కేసు నమోదు

ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన భార్య, కూతురిని కుటుంబ సభ్యులు కదిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి అత్యవసర చికిత్స అందిస్తున్నారు. సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు సంఘటనా స్థలాన్ని, ఆసుపత్రిని సందర్శించి బాధితుల నుండి వివరాలు సేకరించారు. మహిళలపై గృహ హింస మరియు దాడికి పాల్పడినందుకు గానూ జనసేన నాయకుడు భైరవ ప్రసాద్‌పై పోలీసులు వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. నియోజకవర్గ స్థాయిలో పార్టీని నడిపించే నాయకుడే ఇలా సొంత భార్య, కూతురిపై దారుణానికి ఒడిగట్టడం కదిరి ప్రాంతంలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also :

కేంద్రానికి సీఎం చంద్రబాబు లేఖ

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha