Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
కలెక్టర్ చేతుల మీదుగా 'మాస్టర్ యువర్ మైండ్' పుస్తకావిష్కరణ!

కలెక్టర్ చేతుల మీదుగా 'మాస్టర్ యువర్ మైండ్' పుస్తకావిష్కరణ!

వార్త 4 days ago

Master Your Mind Book: మనిషి ప్రవర్తనలోని ప్రత్యేకతలను విశ్లేషించడం క్లిష్టమైన విషయమని, శారీరక శ్రమ కంటే అధిక ఆలోచనలే మనసును ఎక్కువగా అలసటకు గురిచేస్తాయని మెదక్ జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ పేర్కొన్నారు.

మెదక్ జిల్లా పెద్ద శంకరంపేటకు చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు, ప్రముఖ రచయిత భృంగి ప్రసన్నకుమార్ రచించిన "మాస్టర్ యువర్ మైండ్" పుస్తకాన్ని మంగళవారం జిల్లా కలెక్టర్ ఆడిటోరియంలో ఘనంగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కలెక్టర్ ప్రతిమా సింగ్ పుస్తకాన్ని ఆవిష్కరించి మాట్లాడారు.

Read also: Congress : మహిళల ఆశీర్వాదంతో 2034 వరకు మీమే అధికారంలో - సీఎం రేవంత్

Master Your Mind Book: అన్ని వర్గాల వారికి మార్గదర్శి: కలెక్టర్

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. పరీక్షలను ఎదుర్కొనే విద్యార్థులకు, జీవితంలో స్థిరత్వం కోసం ప్రయత్నించే యువతకు, కుటుంబ బాధ్యతలపై ఆందోళన చెందే పెద్దలకు ఈ పుస్తకం ఒక మంచి మార్గదర్శిగా ఉపయోగపడుతుందని కొనియాడారు. మానసిక ఒత్తిడిని అధిగమించడానికి ఈ గ్రంథం దోహదపడుతుందని పేర్కొంటూ.. రచయిత భృంగి ప్రసన్నకుమార్ భవిష్యత్తులో మరిన్ని మంచి పుస్తకాలు రాయాలని ఆకాంక్షించారు.

ఈ ఘనమైన పుస్తకావిష్కరణ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖాధికారి (DEO) రాజు, ఏఎంఓ (AMO) సుదర్శన మూర్తి, సీఎంఓ (CMO) రాజు, ఎస్ఓ (SO) నవీన్, కరుణాకర్ తదితరులు పాల్గొని రచయితను అభినందించారు.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read also:

మీనాక్షి నటరాజన్‌కు భారీ షాక్.. రాజ్యసభ నామినేషన్ తిరస్కరణ

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha