Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
కల్యాణలక్ష్మి పథకం యథాతథంగా కొనసాగింపు

కల్యాణలక్ష్మి పథకం యథాతథంగా కొనసాగింపు

వార్త 1 week ago

Minister ponnam prabhakar:కల్యాణలక్ష్మి షాదీముబారక్ పథకాలను ఎలాంటి మార్పులు లేకుండా యథాతథంగా కొనసాగిస్తామని రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు.

గత ప్రభుత్వం తీసుకువచ్చిన మంచి పథకాలను తాము ఎప్పుడూ వ్యతిరేకించలేదని ఆయన వెల్లడించారు. ఈ సంక్షేమ పథకాలపై వస్తున్న తప్పుడు ప్రచారాలను ప్రజలు నమ్మవద్దని ఆయన స్పష్టంగా తెలిపారు.

Read also: Telangana Fine Paddy Bonus: సన్న వడ్లకు బోనస్.. వారికి మాత్రమే వర్తింపు

 Kalyana Lakshmi and Shaadi Mubarak schemes

పథకాలపై వస్తున్న రాజకీయ కుట్రలు

ఈ పథకాలపై కొందరు వ్యక్తులు కావాలనే కోర్టులో పిటిషన్లు వేయించారని మంత్రి ఆరోపించారు. దీని వెనుక పెద్ద రాజకీయ కుట్ర ఉందని ఆయన సందేహం వ్యక్తం చేశారు. హైకోర్టు ఇచ్చిన చిన్న స్టే ఆర్డర్ ను అడ్డుపెట్టుకుని కొందరు నాయకులు అనవసర రాజకీయం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.

Minister ponnam prabhakar:న్యాయపరమైన అడ్డంకులు తొలగింపు

కోర్టులో ఉన్న స్టేను త్వరలోనే పూర్తిగా ఎత్తివేయించి అర్హులైన పేద కుటుంబాలకు మళ్లీ ఈ ఆర్థిక సహాయం అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఎలాంటి భేషజాలకు పోకుండా ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తుందని మంత్రి భరోసా ఇచ్చారు.

Epaper: epaper.vaartha.com

నేడు, రేపు వర్షాల హెచ్చరిక

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha