Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
కమల్ హాసన్ నిర్మాణంలో రజనీకాంత్ 'ధర్మన్'.. ఫస్ట్ లుక్ విడుదల

కమల్ హాసన్ నిర్మాణంలో రజనీకాంత్ 'ధర్మన్'.. ఫస్ట్ లుక్ విడుదల

వార్త 1 week ago

Rajinikanth Dharman movie: సూపర్ స్టార్ రజనీకాంత్, లోకనాయకుడు కమల్ హాసన్ కలయికలో వస్తున్న మోస్ట్ అవైటెడ్ క్రేజీ ప్రాజెక్ట్‌కు సంబంధించిన ఒక సంచలన అప్‌డేట్ వచ్చేసింది.

ఇప్పటివరకు ‘తలైవా 173’ అనే వర్కింగ్ టైటిల్‌తో ప్రచారంలో ఉన్న ఈ చిత్రానికి ‘ధర్మన్’ అనే పవర్‌ఫుల్ టైటిల్‌ను ఖరారు చేశారు. కమల్ హాసన్‌కు చెందిన ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ ‘రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్’ ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది.

ఈ టైటిల్ ప్రకటన సందర్భంగా మేకర్స్ విడుదల చేసిన పోస్టర్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఆపరేషన్ థియేటర్‌లో రజనీకాంత్ చేతిలో సర్జికల్ బ్లేడ్‌తో నిల్చొని ఉండగా… ఆయన కాలు కింద ఒక రౌడీ పడి ఉన్నట్టుగా ఈ పోస్టర్‌ను అత్యంత వినూత్నంగా డిజైన్ చేశారు. దీంతో ఈ సినిమాలో రజనీకాంత్ ఒక పవర్‌ఫుల్ డాక్టర్‌గా కనిపించబోతున్నారనే వార్తలకు అధికారిక ముద్ర పడింది. ఈ టైటిల్ పోస్టర్‌ను షేర్ చేస్తూ కమల్ హాసన్ తమిళంలో ‘ధర్మమే వెల్లుమ్!’ అని ట్వీట్ చేయడం విశేషం.

Read Also : Peddi Movie: 'పెద్ది' సక్సెస్ సెలబ్రేషన్స్.. అనాథ పిల్లలకు చరణ్ స్పెషల్ గిఫ్ట్

 Rajinikanth's 'Dharman' produced by Kamal Haasan… First look released.

Rajinikanth Dharman movie: దర్శకుడి మార్పులపై వీడిన సస్పెన్స్

ఈ ప్రాజెక్ట్ అనౌన్స్ అయినప్పటి నుంచి దర్శకుడి విషయంలో పలు మార్పులు జరిగాయి. వాస్తవానికి ఈ చిత్రానికి మొదట దర్శకుడిగా సుందర్ సి పేరును ప్రకటించారు. కానీ, కొన్ని కారణాల వల్ల ఆయన తప్పుకోవడంతో ఆ తర్వాత ‘డాన్’ ఫేమ్ సిబి చక్రవర్తి పేరు తెరపైకి వచ్చింది. అయితే అనూహ్యంగా ఆయన కూడా ఈ ప్రాజెక్ట్ నుంచి వైదొలిగారు. ఈ క్రమంలోనే ‘ఓ మై కడవలే’, ‘డ్రాగన్’ చిత్రాల దర్శకుడు అశ్వత్ మరిముత్తు ఈ సినిమాను తెరకెక్కిస్తారనే ప్రచారం గట్టిగా సాగింది. తాజాగా విడుదల చేసిన అఫీషియల్ పోస్టర్‌తో అశ్వత్ మరిముత్తునే ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నట్లు స్పష్టమైంది.

కమల్ హాసన్, ఆర్. మహేంద్రన్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఇండస్ట్రీలోని బెస్ట్ టెక్నీషియన్లు పనిచేస్తున్నారు. రాక్‌స్టార్ అనిరుధ్ రవిచందర్ ఈ సినిమాకు పవర్‌ఫుల్ సంగీతాన్ని అందిస్తుండగా, జాతీయ అవార్డు గ్రహీతలైన యాక్షన్ కొరియోగ్రాఫర్స్ అనిబరివ్ ద్వయం స్టంట్స్ డిజైన్ చేస్తున్నారు. రజనీకాంత్-కమల్ హాసన్ కాంబినేషన్‌లో వస్తున్న సినిమా కావడంతో ఈ ‘ధర్మన్’ చిత్రంపై అటు ఇండస్ట్రీ వర్గాల్లో, ఇటు అభిమానుల్లో అకాశాన్నంటే అంచనాలు నెలకొన్నాయి.

నటుడు ప్రకాష్ రాజ్‌కు బెంగళూరు కోర్టు బిగ్ షాక్.. నాన్-బెయిలబుల్ వారెంట్ జారీ

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha