Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
కంబాలపల్లిలో అంబేద్కర్ జయంతి: ఆద్య హాస్పిటల్ ఉచిత వైద్య శిబిరం

కంబాలపల్లిలో అంబేద్కర్ జయంతి: ఆద్య హాస్పిటల్ ఉచిత వైద్య శిబిరం

వార్త 2 months ago

Free Medical Camp Kambalapally: డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయం సందర్భంగా కంబాలపల్లి గ్రామంలో ఉచిత వైద్య శిబిరం… భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలను మనమంతా ఆచరించాలని కంబాలపల్లి గ్రామ సర్పంచ్ ఇందూరి భారతమ్మ బాబు అన్నారు.

అంబేద్కర్ 135 వ జయంతిని పురస్కరించుకొని సదాశివపేట మండలం కంబాలపల్లి గ్రామంలో జయంతోత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సదాశివపేటలోని ఆద్య హాస్పిటల్ డాక్టర్స్ హరీష్ రెడ్డి, రవీంద్రనాథ్ కోటి,అభినవరెడ్డి, మహేష్, యాదిరెడ్డి, అభిషేక్ మొదలగువారు గ్రామంలో ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు.

Read Also:Sangareddy Ambedkar Celebrations: కంకోల్‌లో మిన్నంటిన అంబేద్కర్ జయంతి సంబరాలు

 Ambedkar Jayanti Celebrations Sadashivapet

Free Medical Camp Kambalapally: సర్పంచ్, గ్రామస్తుల భాగస్వామ్యం

ఈ వైద్య శిబిరాన్ని ప్రారంభించిన సీఐ వెంకటేశం, సిడిసి చైర్మన్ గడిల రామిరెడ్డి మాట్లాడుతూ భారతదేశానికి ఆయన చేసిన సేవలను కీర్తిస్తూ ఆయన ఆలోచన విధానాలను స్ఫూర్తిగా తీసుకొని మనమంతా పని చేయాలని అన్నారు. సిఐ వెంకటేశం వైద్య శిబిరంలో పాల్గొని బిపి నిర్ధారణ పరీక్షలు చేయించుకున్నారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ అభిమానులు గ్రామస్తులు తోపాటు పాలకవర్గం వార్డు మెంబర్స్ ఆంజనేయులు,ప్రభు, మునీర్, ప్రభాకర్ రెడ్డి గ్రామ అధ్యక్షులు బేలూరు భీమ్సేన్ రెడ్డి సాయిరాజ్ మాణిక్యం, శేఖర్ పాల్గొన్నారు.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

గొంగూరు గ్యాస్ గోదాం వద్ద బారులు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha