Dailyhunt
కంకోల్‌లో మిన్నంటిన అంబేద్కర్ జయంతి సంబరాలు

కంకోల్‌లో మిన్నంటిన అంబేద్కర్ జయంతి సంబరాలు

వార్త 1 week ago

Sangareddy Ambedkar Celebrations: సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం కంకోల్ గ్రామంలో 135 వ అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.గ్రామంలో యువతి యువకులు ఊరేగింపుగా కోలాటంలతో అంబేద్కర్ విగ్రహం వద్దకు చేరుకొని పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.

అదేవిదంగా మండల అంబేద్కర్ సంఘం ఆధ్వర్యంలో తాటిపల్లి నుంచి పెద్దచెల్మెడ,కంకోల్,బుదేరా మీదుగా మునిపల్లి చౌరస్తా వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మమతా నగేష్, ఉప సర్పంచ్ అప్సర్, వార్డ్ సభ్యులు గ్రామ యువజన నాయకులు ఆనంద్,అంబేద్కర్ సంఘం అధ్యక్షులు నరసింహులు, అంబేద్కర్ సంఘం ఉపాధ్యక్షులు జి.వీరేశం, నర్సింలు,ఆదర్శ యూత్ అధ్యక్షులు సుధాకర్, శ్రీశైలం, మహేష్, మండల అంబేద్కర్ సంఘం నాయకులు రాములు, పాండు, బాలరాజ్, నగేష్,జనార్దన్, భాస్కర్, రాములు,యువతి యువకులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.

Read Also: Kalvakuntla kavitha: అసమానతలు లేని సమాజమే బాబాసాహెబ్ ఆశయం.. కవిత

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

ప్రధాని మోడీకి తెలంగాణ సీఎం రేవంత్ లేఖ

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha