Kanakaraj Confusion : ప్రతి శుక్రవారం కొత్త సినిమాల సందడి కనిపిస్తుంటుంది. ఈ వారం కూడా టాలీవుడ్‌తో పాటు ఇతర ఇండస్ట్రీలకు చెందిన సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి.
అయితే ఈసారి రెండు సినిమాల విషయంలో ఓ ఆసక్తికరమైన కామన్ పాయింట్ సోషల్ మీడియాలో చర్చకు దారితీస్తోంది. అదే 'కనకరాజ్' (Kanakaraj Confusion) అనే పేరు.
లోకేష్ కనకరాజ్ లీడ్ రోల్‌లో డీసీ :
వరుణ్ తేజ్ హీరోగా నటించిన సినిమా 'కొరియన్ కనకరాజ్' శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరోవైపు లోకేష్ కనకరాజ్ లీడ్ రోల్‌లో నటించిన డీసీ సినిమా కూడా అదే రోజున విడుదలైంది. ఈ రెండు సినిమాలకు కథ, నేపథ్యం, సెటప్ పరంగా ఎలాంటి సంబంధం లేకపోయినా.. కనకరాజ్ అనే పేరు మాత్రం ప్రేక్షకుల్లో ఆసక్తికరమైన కన్ఫ్యూజన్‌కు కారణమవుతోంది.

ముఖ్యంగా సోషల్ మీడియాలో ఎవరైనా 'కనకరాజ్ సినిమా చూడాలి' అంటూ కామెంట్ చేస్తే.. అది వరుణ్ తేజ్ నటించిన 'కొరియన్ కనకరాజ్' గురించా? లేక లోకేష్ కనకరాజ్ లీడ్ రోల్‌లో వచ్చిన 'డీసీ' గురించా? అనే సందేహం వస్తోంది. వరుణ్ తేజ్ సినిమా టైటిల్‌లోనే కనకరాజ్ ఉండటం ఒకవైపు.. మరోవైపు లోకేష్ కనకరాజ్‌కు ఉన్న బ్రాండ్ ఇమేజ్ కారణంగా ఈ చర్చ మరింత ఆసక్తికరంగా మారింది. ఇక సినిమాల విషయానికి వస్తే.. ఈ రెండు చిత్రాలు కూడా ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్‌ను అందుకుంటున్నట్లు తెలుస్తోంది. దీంతో ఒకే పేరుతో ముడిపడిన ఈ రెండు సినిమాలపై సోషల్ మీడియాలో చర్చ మరింత పెరుగుతోంది.
మొత్తానికి 'కొరియన్ కనకరాజ్' వర్సెస్ 'లోకేష్ కనకరాజ్' అంటూ సాగుతున్న ఈ ఆసక్తికరమైన పోలికకు ప్రధాన కారణం మాత్రం ఒక్కటే.. కనకరాజ్ అనే పేరు కథలు వేరు.. హీరోలు వేరు.. సినిమాల నేపథ్యాలు వేరు.. కానీ పేరు విషయంలో మాత్రం ఈ రెండు సినిమాలు ప్రేక్షకులను కాసేపు కన్ఫ్యూజ్ చేస్తున్నాయి.

