Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
కండరాల నొప్పుల నివారణకు చిట్కాలు

కండరాల నొప్పుల నివారణకు చిట్కాలు

వార్త 2 weeks ago

Muscle Pains : కండరాల నొప్పులు ఈ రోజుల్లో చాలా మందిని వేధిస్తున్న సమస్య. మితిమీరిన వ్యాయామం, ఒత్తిడి, పోషకాహార లోపం లేదా ఒకే చోట ఎక్కువ సేపు కూర్చోవడం వల్ల ఈ నొప్పులు రావచ్చు.

వర్కౌట్ చేసిన తర్వాత చాలా మందికి కండరాల నొప్పులు వస్తూ ఉంటాయి. మంచి వ్యాయామం చేసిన ఆనందం ఉన్నప్పటికీ, మరుసటి రోజు కూర్చోవడం, నిలబడడం కూడా కష్టంగా అనిపించే స్థితి వస్తుంది. దీనినే వైద్యపరంగా డిలేయ్డ్ ఆన్‌సెట్ మజిల్ సోరెనెస్అని అంటారు. అయితే ఇది శరీరం బలహీనమవుతోందనే సంకేతం కాదని అసలు విషయం ఏమిటంటే కండరాలు పునర్నిర్మాణం అవుతూ మరింత బలంగా మారుతున్న ప్రక్రియలో భాగమని నిపుణులు తెలియజేస్తున్నారు. అయితే ఈ నొప్పిని తగ్గించుకోవడానికి సరైన ఆహారం కీలక పాత్ర పోషిస్తుందని వారు చెబుతున్నారు. వ్యాయామం చేసే సమయంలో కండరాల ఫైబర్లలో చిన్నచిన్న చీలికలు ఏర్పడతాయి. ఆ తర్వాత శరీరం వాటిని సరిచేసి కొత్త కండర కణజాలాన్ని నిర్మిస్తుంది. ఈ ప్రక్రియలో కొంత ఇన్‌ఫ్లమేషన్ (వాపు) ఏర్పడి నొప్పిని కలిగిస్తుంది. ఈ దశలో సరైన పోషకాలు అందితే నొప్పి తగ్గడమే కాకుండా త్వరగా కోలుకునే అవకాశం ఉంటుంది.

Read Also: Eye stroke symptoms: ఐ స్ట్రోక్ సంకేతాలు.. వీటిని నిర్లక్ష్యం చేస్తే శాశ్వత అంధత్వమే!

 Muscle Pains

Muscle Pains : కార్బొహైడ్రేట్లు

కండరాల పునరుద్ధరణకు ప్రోటీన్ అత్యంత అవసరం. ఇది కండరాలను తిరిగి నిర్మించడంలో సహాయపడుతుంది. అలాగే కార్బొహైడ్రేట్లు శరీరానికి శక్తిని తిరిగి అందిస్తాయి. ఇన్‌ఫ్లమేషన్ (వాపు)ను తగ్గించడానికి యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు కలిగిన ఆహారాలు ఉపయోగపడతాయి. ద్రవాలు, ఖనిజాలు కండరాలు పట్టేయడాన్ని తగ్గించడంలో సహాయపడతాయి. రోజువారీ జీవితంలో సులభంగా లభించే కొన్ని ఆహార పదార్థాలు కండరాల నొప్పిని తగ్గించడంలో ముఖ్య పాత్ర పోషిస్తాయి. స్ట్రాబెర్రీలు, బ్లూబెర్రీలు, రాస్ప్‌బెర్రీలు వంటి బెర్రీలు యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉండి ఇన్‌ఫ్లమేషన్‌ను తగ్గిస్తాయి. టార్ట్ చెర్రీ జ్యూస్ కండరాల నొప్పిని తగ్గించి శక్తి పునరుద్ధరణకు సహాయపడుతుందని పరిశోధనలు సూచిస్తున్నాయి.

యాంటీఆక్సిడెంట్లు

అలాగే సాల్మన్, మాకరెల్ వంటి ఫ్యాటి చేపలలో ఒమెగా-3 ఫ్యాటీ యాసిడ్లు అధికంగా ఉండి కండరాల నొప్పిని తగ్గించడంలో సహాయపడతాయి. పాలకూర, కేల్, మెంతికూర వంటి ఆకుకూరలు మెగ్నీషియం, యాంటీఆక్సిడెంట్లను అందించి కండరాల విశ్రాంతికి దోహదపడతాయి. వ్యాయామం తర్వాత శరీరంలో శక్తి నిల్వలు తగ్గిపోతాయి. ఈ సమయంలో చిలగడదుంపలు, క్యారెట్లు వంటి ఆహారాలు శక్తిని తిరిగి అందించడమే కాకుండా కండరాల మరమ్మత్తుకు అవసరమైన విటమిన్లను అందిస్తాయి. చియా సీడ్స్, ఫ్లాక్స్ సీడ్స్‌లో ఒమెగా-3లు, ఫైబర్, ప్లాంట్ ప్రోటీన్ సమృద్ధిగా ఉండి ఇన్‌ఫ్లమేషన్‌ను తగ్గిస్తాయి. గ్రీన్ టీ కూడా కండరాల నొప్పిని తగ్గించడంలో సహాయపడుతుంది. ఇందులో ఉన్న యాంటీ ఆక్సిడెంట్లు కండరాలు దెబ్బతినడాన్ని తగ్గించి శరీరానికి ఉపశమనం కలిగిస్తాయి.

 Muscle Pains

సరైన మోతాదులో ..

అయితే ఈ ఆహారాలు మాత్రమే కాకుండా సరైన మోతాదులో ప్రోటీన్, కార్బొహైడ్రేట్ల సమతుల్యం కూడా ఎంతో ముఖ్యమైనది. కండరాల నొప్పిని పూర్తిగా నివారించడం సాధ్యం కాకపోయినా, సరైన ఆహారం ద్వారా దాన్ని తగ్గించుకోవచ్చు. ఇది శరీరం అభివృద్ధి చెందుతున్న సంకేతం కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు. కాబట్టి వ్యాయామం చేసిన తర్వాత విశ్రాంతితోపాటు సరైన పోషకాహారం తీసుకుంటే త్వరగా కోలుకుని మరింత ఉత్సాహంతో మళ్లీ వ్యాయామం చేయగలుగుతారని నిపుణులు తెలియజేస్తున్నారు.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

ఉపిరి పీల్చుకోవడం ఒక వరం!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha