Dailyhunt
అసమానతలు లేని సమాజమే బాబాసాహెబ్ ఆశయం.. కవిత

అసమానతలు లేని సమాజమే బాబాసాహెబ్ ఆశయం.. కవిత

వార్త 1 week ago

Kalvakuntla kavitha: డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి వేడుకలను పురస్కరించుకుని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఘనంగా నివాళులర్పించారు.

ఎస్సీ, ఎస్టీ ఫోరమ్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న ఆమె, అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, సమాజంలో పేరుకుపోయిన అసమానతలను తొలగించి, అందరికీ సమాన హక్కులు కల్పించే సమసమాజాన్ని బాబాసాహెబ్ కోరుకున్నారని గుర్తుచేశారు. “అంబేద్కర్ అంటేనే ధైర్యం” అని, ఆయన ఆలోచనలు నేటికీ స్ఫూర్తిదాయకమని కొనియాడారు.

Read Also: Ambedkar Jayanti TGSRTC:ఆర్టీసీ కళాభవన్‌లో ఘనంగా అంబేద్కర్ జయంతి

 Kalvakuntla kavitha tribute to Dr. B.R. Ambedkar statue

కవిత ఈ సందర్భంగా “ఈరోజు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిందంటే అది కేవలం అంబేద్కర్ రాసిన రాజ్యాంగం వల్లనే సాధ్యమైంది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 మనకు ఆ శక్తిని ఇవ్వకపోతే, తెలంగాణ ఉద్యమానికి నైతిక పునాది ఉండేది కాదు” అని ఆమె వ్యాఖ్యానించారు. పేదల తలరాతను మార్చగలిగే శక్తి కేవలం రాజ్యాంగానికే ఉందని, దానిని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని పేర్కొన్నారు.

Kalvakuntla kavitha: ప్రభుత్వ తీరుపై ఘాటు విమర్శలు

అంబేద్కర్ ఆశయ సాధన కోసం పోరాడుతూనే, ప్రస్తుత ప్రభుత్వంపై కవిత తీవ్ర విమర్శలు గుప్పించారు. అంబేద్కర్ ఇచ్చిన ధైర్యంతోనే ఈ ప్రభుత్వంపై పోరాటం కొనసాగిస్తామని, పేదలకు న్యాయం జరిగే వరకు వెనకడుగు వేయబోమని స్పష్టం చేశారు. “ఈ భూమి మీద అంబేద్కర్ వ్యతిరేకులు ఎవరైనా ఉన్నారంటే అది కేవలం రేవంత్ రెడ్డి మాత్రమే” అని ఆరోపించారు. ప్రభుత్వానికి ఇప్పటికైనా బుద్ధి రావాలని, దళితులు, గిరిజనుల సంక్షేమంపై దృష్టి పెట్టాలని ఆమె డిమాండ్ చేశారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

ఎస్టియు ఆధ్వర్యంలోఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha