Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
World Radio Day 2026: నేడు వరల్డ్ రేడియో డే

World Radio Day 2026: నేడు వరల్డ్ రేడియో డే

వార్త 4 months ago

సోషల్ మీడియా, టెలివిజన్, స్మార్ట్‌ఫోన్‌ల హవా నడుస్తున్న ఈ డిజిటల్ యుగంలోనూ రేడియో తన ప్రత్యేకతను నిలబెట్టుకుంటూ ముందుకు సాగుతోంది. ప్రతి క్షణం స్క్రీన్‌ల మధ్య మునిగిపోయిన ప్రపంచంలో, కేవలం శబ్దం ద్వారానే మనసులను తాకే శక్తి రేడియోకే ప్రత్యేకం.

ఈ నేపథ్యంలో ఇవాళ (ఫిబ్రవరి 13) ప్రపంచ రేడియో దినోత్సవాన్ని (World Radio Day 2026) జరుపుకోవడం మరింత ప్రాధాన్యతను సంతరించుకుంది. 'రేడియో, కృత్రిమ మేధస్సు' (Radio and Artificial Intelligence) అనే ఈ ఏడాది థీమ్.. సంప్రదాయ ప్రసార మాధ్యమానికి, ఆధునిక సాంకేతికతకు మధ్య మారుతున్న సంబంధాన్ని స్పష్టం చేస్తోంది.

TamilNadu: ఒంటరిగానే పోటీ చేసి ఫుల్ మెజార్టీ సాధిస్తామన్న విజయ్

పరికరం కాదు, ఎమోషన్..

రేడియో (World Radio Day 2026) కేవలం ఒక పరికరం కాదు, అది ఒక ఎమోషన్. మానవ చరిత్రలో అత్యంత శక్తివంతమైన మాధ్యమంగా రేడియో తనదైన ముద్ర వేసింది. 1946 ఫిబ్రవరి 13న ఐక్యరాజ్యసమితి రేడియో ప్రారంభమైంది. యునెస్కో ఈ రోజును ప్రపంచ రేడియో దినో త్సవంగా ప్రకటించింది. యుద్ధాలు జరిగినప్పుడు సమాచారాన్ని చేరవేయడంలోనూ, ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు హెచ్చ రికలు జారీ చేయడంలోనూ, అక్షరాస్యత లేని మారుమూల గ్రామాల్లో విజ్ఞానాన్ని పంచడంలోనూ రేడియో పోషించిన పాత్ర అద్వితీయం. ప్రపంచంలో విద్యుత్ వెలుగులు చూడని గ్రామాలు ఉండొచ్చేమో గానీ, రేడియో తరంగాలు తాకని ప్రదేశం ఉండద నడంలో అతిశయోక్తి లేదు.

తెలుగు వారి రేడియో బంధం..

తెలుగు వారికైతే రేడియోతో ఉన్న బంధం విడదీయరానిది. ఘంటసాల గొంతులో భక్తి పాటలు, 'కార్మికుల కార్యక్రమం', 'రైతుల కోసం', 'వనితా వాణి', సాయంత్రం వేళ 'వివిధ భారతి'లో వచ్చే సినిమా పాటలు.. ఇవన్నీ ఒక తరం తెలుగు వారి జీవితంలో భాగమయ్యాయి.. ముఖ్యంగా తుఫానులు వచ్చినప్పుడు కోస్తా తీర ప్రాంత ప్రజలకు రేడియోనే దైవం. కరెంట్ లేకపోయినా, బ్యాటరీలతో పనిచేసే రేడియోలు ఎంతోమంది ప్రాణాలను కాపాడాయి. సమాచారాన్ని ఇంత వేగంగా, ఇంత తక్కువ ఖర్చుతో సామాన్యుడికి చేరవేసే సాధనం మరొకటి లేదు.. అందుకే మహాత్మా గాంధీ రేడియోను 'అద్భుతమైన శక్తి'గా అభివర్ణించారు..

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha