Dailyhunt
కన్నకూతురు శవంతో ఐదు నెలల సహవాసం: మేరఠ్‌లో వెలుగుచూసిన హృదయవిదారక ఘటన!

కన్నకూతురు శవంతో ఐదు నెలల సహవాసం: మేరఠ్‌లో వెలుగుచూసిన హృదయవిదారక ఘటన!

వార్త 1 week ago

ఇంట్లోనే అస్థిపంజరం - షాక్‌లో బంధువులుఉత్తరప్రదేశ్‌లోని మేరఠ్‌లో ఒక రిటైర్డ్ క్లర్క్ తన కూతురు మృతదేహంతో ఏకంగా ఐదు నెలల పాటు ఒకే ఇంట్లో గడిపిన ఘటన స్థానికంగా కలకలం రేపింది.

మేరఠ్‌లోని తేలీ మొహల్లాకు చెందిన ఉదయ్ భాను బిస్వాస్ (76) అనే వ్యక్తి, తన కుమార్తె ప్రియాంక బిస్వాస్ ఐదు నెలల క్రితమే మరణించినప్పటికీ, ఆమె మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించకుండా ఇంట్లోనే భద్రపరిచాడు.

దుర్వాసన రాకుండా పర్ఫ్యూమ్స్ వాడకం

మృతదేహం కుళ్లిపోయి దుర్వాసన రాకుండా ఉండేందుకు ఉదయ్ భాను ఇంట్లో భారీగా పర్ఫ్యూమ్ బాటిళ్లను ఉపయోగించినట్లు పోలీసులు గుర్తించారు. శవం నుంచి వచ్చే వాసన బయటకు రాకుండా గది నిండా సుగంధ ద్రవ్యాలు చల్లుతూ, ఆమె ఇంకా నిద్రపోతున్నట్లే బెడ్‌పై దుప్పటి కప్పి ఉంచాడు. పోలీసుల తనిఖీల్లో ఇంట్లో పదుల సంఖ్యలో ఖాళీ పర్ఫ్యూమ్ సీసాలు లభించడం గమనార్హం.

Read Also: Earthquake in Maharashtra: మహారాష్ట్ర హింగోలిలో భూకంపం

 Meerut in Uttar Pradesh

Meerut in Uttar Pradesh: విద్యావంతురాలు.. కానీ మానసిక కుంగుబాటుతో..

ప్రియాంక బిస్వాస్ డబుల్ ఎంఏ, ఎంటెక్ చదివిన విద్యావంతురాలు. ప్రైవేట్ టీచర్‌గా కంప్యూటర్ పాఠాలు చెప్పేది. అయితే, 13 ఏళ్ల క్రితం తన తల్లి మరణించినప్పటి నుండి ఆమె మానసిక స్థితి సరిగా లేదు. కాలక్రమేణా ఆమె అనారోగ్యం (కామెర్లు) బారిన పడిందని, డిసెంబర్ 5వ తేదీన ఆమె మరణించిందని తండ్రి పోలీసుల విచారణలో అంగీకరించాడు. అయితే ఆమె మృతదేహాన్ని వదలలేక తండ్రి ఇలా ప్రవర్తించి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. చాలా కాలంగా ప్రియాంక కనిపించకపోవడంతో బంధువులు ఆమె గురించి ఆరా తీశారు. ఉదయ్ భాను మొదట ఆమె డెహ్రాడూన్‌లో చికిత్స పొందుతుందని అబద్ధం చెప్పినప్పటికీ, ఏప్రిల్ 10న (శుక్రవారం) బంధువుల ఒత్తిడి మేరకు కూతురు ఇంట్లోనే ఉందని నిజం చెప్పాడు. వారు లోపలికి వెళ్లి చూడగా బెడ్‌పై కేవలం అస్థిపంజరం మాత్రమే కనిపించింది.

పోలీసు దర్యాప్తు – మంత్రగాళ్ల కోణంపై అనుమానం

సివిల్ లైన్స్ సీఓ నవీనా శుక్లా తెలిపిన వివరాల ప్రకారం, మృతదేహం పూర్తిగా కుళ్లిపోయి కేవలం ఎముకల గూడులా మారింది. అయితే, ప్రియాంక అనారోగ్యానికి ఉదయ్ భాను ఒక మత గురువు (మంత్రగాడు) దగ్గర చికిత్స చేయించాడనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. మూఢనమ్మకాల వల్ల ఇలా జరిగిందా? లేక కూతురిపై ప్రేమతో తండ్రి ఆమెను వదలలేకపోయారా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ead Also hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

10 మంది మృతి, ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన ప్రధాని!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha