Telangana student death in USA:అమెరికాలో తెలంగాణ విద్యార్థి మృతి చెందడం రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది. ఉన్నత చదువుల కోసం ఫ్లోరిడా వెళ్లిన మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన అరుణ్ సాయి రెడ్డి బొల్లెందుల హఠాత్తుగా మరణించాడు.
26 ఏళ్ల ఈ యువకుడు అక్కడ చదువు పూర్తి చేసి ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న సమయంలో అనారోగ్యం పాలయ్యాడు. ఈ వార్త తెలియగానే కుటుంబ సభ్యులు, బంధువులు తీవ్ర శోకసంద్రంలో మునిగిపోయారు.
Read also: Khammam: ఖమ్మంలో ఇద్దరు పిల్లలకు విషమిచ్చి తల్లి ఆత్మహత్యాయత్నం
Telangana student Arun Sai Reddy USA
అనారోగ్యంతో ఆసుపత్రిలో ప్రాణాలు విడిచిన అరుణ్
ఫ్లోరిడాలోని టెంపా నగరంలో నివసిస్తున్న అరుణ్ జూన్ 19న అకస్మాత్తుగా తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు. వెంటనే స్నేహితులు అతడిని ఆసుపత్రికి తీసుకెళ్లారు. వైద్యులు అత్యవసర చికిత్స అందించినా ఫలితం లేకపోయింది. పరిస్థితి విషమించడంతో ఆసుపత్రిలోనే అరుణ్ కన్నుమూశాడు. విదేశాల్లో ఇలాంటి ఘటనలు జరగడం తెలుగు విద్యార్థుల తల్లిదండ్రులను ఆందోళనకు గురిచేస్తోంది.
Telangana student death in USA:స్వదేశానికి చేరుకోనున్న పార్థివ దేహం
అరుణ్ మృతదేహాన్ని అమెరికా నుంచి స్వస్థలానికి తరలించేందుకు ప్రవాస తెలుగు సంఘాలు సహకారం అందిస్తున్నాయి. కుటుంబ సభ్యుల వద్దకు మృతదేహాన్ని పంపేందుకు అవసరమైన ఏర్పాట్లు సాగుతున్నాయి. భవిష్యత్తుపై ఎన్నో ఆశలతో విదేశాలకు వెళ్లిన యువకుడు ఇలా అర్ధాంతరంగా తనువు చాలించడం అందరిని కలిచివేస్తోంది. త్వరలోనే మృతదేహం హైదరాబాద్ చేరుకునే అవకాశం ఉంది.
Read Also hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also:
భూపాలపల్లిలో ఘోర ప్రమాదం.. టిప్పర్ ఢీకొని DTO వెంకన్న దుర్మరణం

