KTR: జనగామ జిల్లాలో భారత్ రాష్ట్ర సమితి (BRS) వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు (కేటీఆర్) పర్యటనలో స్వల్ప ఉద్రిక్తత చోటుచేసుకుంది.
కన్నెపల్లి పంప్‌హౌస్ సందర్శన కోసం భారీ కాన్వాయ్‌తో వెళ్తున్న కేటీఆర్‌ను పెంబర్తి చెక్‌పోస్ట్ వద్ద పోలీసులు అడ్డుకున్నారు.
read also: Ration Card : రేషన్ కార్డు లేని వారికి మంత్రి పొన్నం ప్రభాకర్ గుడ్ న్యూస్
పోలీసులతో బీఆర్ఎస్ శ్రేణుల వాగ్వాదం
ఆదివారం మధ్యాహ్నం ఈ ఘటన జరిగింది. నిబంధనల ప్రకారం ఇంత పెద్ద సంఖ్యలో వాహనాలతో కూడిన కాన్వాయ్‌కు ముందస్తు అనుమతి లేదంటూ పోలీసులు వాహనాలను నిలిపివేశారు. పోలీసుల చర్యపై ఆగ్రహం వ్యక్తం చేసిన బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు వారితో వాగ్వాదానికి దిగారు. రంగంలోకి దిగిన కేటీఆర్ స్వయంగా పోలీస్ అధికారులతో మాట్లాడారు. తన కాన్వాయ్‌లోని అన్ని వాహనాలను అనుమతించాల్సిందేనని స్పష్టం చేశారు. ఉత్కంఠభరిత చర్చల అనంతరం పోలీసులు వెనక్కి తగ్గడంతో, కేటీఆర్ కాన్వాయ్ కన్నెపల్లి పంప్‌హౌస్ వైపు తన ప్రయాణాన్ని కొనసాగించింది.

