Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
కన్నౌజ్‌లో మైనర్ బాలికపై అత్యాచారం!

కన్నౌజ్‌లో మైనర్ బాలికపై అత్యాచారం!

వార్త 3 months ago

Kannauj Crime: ఉత్తరప్రదేశ్‌లోని కన్నౌజ్ జిల్లాలో అత్యంత దారుణమైన ఘటన వెలుగుచూసింది. కేవలం 14 ఏళ్ల మైనర్ బాలికపై ఒక వ్యక్తి అమానవీయంగా అత్యాచారానికి పాల్పడటం స్థానికంగా తీవ్ర ఆగ్రహావేశాలకు దారి తీసింది.

నమ్మించి మదర్సాకు పిలిపించి..

పోలీసుల ప్రాథమిక సమాచారం మేరకు, నిందితుడు ఆ బాలికను నమ్మించి ఒక మదర్సాకు తీసుకువెళ్లాడు. అక్కడ ఆమెను నిర్బంధించి, తప్పించుకునే అవకాశం లేకుండా చేశాడు. అనంతరం బాధితురాలికి మత్తు పదార్థాలు తినిపించి, ఆమె స్పృహ కోల్పోయిన తర్వాత ఈ ఘాతుకానికి ఒడిగట్టాడు. బాలికపై లైంగిక దాడికి పాల్పడి నిందితుడు అక్కడి నుంచి పరారయ్యాడు.

Read also: Howrah Shibpur Explosion: హౌరాలో భారీ పేలుడు: బెంగాల్ శాంతిభద్రతలపై వెల్లువెత్తుతున్న విమర్శలు

స్థానికుల సమాచారంతో వెలుగులోకి..

అపస్మారక స్థితిలో పడి ఉన్న బాలికను గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు బాధితురాలిని హుటాహుటిన సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె అక్కడ చికిత్స పొందుతోంది. బాలిక ఆరోగ్య పరిస్థితిని వైద్యులు నిశితంగా పర్యవేక్షిస్తున్నారు.

Kannauj Crime: నిందితుడి కోసం గాలింపు

ఈ ఘటనపై కన్నౌజ్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తును వేగవంతం చేశారు. మదర్సా పరిసరాల్లో ఆధారాలు సేకరించడంతో పాటు, నిందితుడిని పట్టుకోవడానికి ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. మహిళలు మరియు చిన్నారుల భద్రతపై ఆందోళన కలిగిస్తున్న ఈ ఘటనపై సర్వత్రా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. నిందితుడికి కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

తమిళనాడులో రాజకీయ పద్మవ్యూహం: పోసాని కృష్ణమురళి

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha