Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
కన్నుల పండుగగా లక్ష్మీ వెంకటేశ్వర స్వామి కళ్యాణోత్సవం

కన్నుల పండుగగా లక్ష్మీ వెంకటేశ్వర స్వామి కళ్యాణోత్సవం

వార్త 2 months ago

Pedda Shankarampet Temple: మండల కేంద్రమైన పెద్ద శంకరంపేటలోని శ్రీ గోదా సమేత లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయ వార్షికోత్సవ వేడుకలు రెండవ రోజు ఘనంగా నిర్వహించారు.

శనివారం నాడు ఉదయం స్వామివారికి ప్రత్యేక అభిషేకాలతో పాటు పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ ధర్మకర్త విగ్రాం శ్రీనివాస్ గౌడ్ దంపతుల ఆధ్వర్యంలో లక్ష్మీ వెంకటేశ్వర స్వామి కళ్యాణోత్సవం భక్తి శ్రద్ధలతో అంగరంగ వైభవంగా నిర్వహించారు.

Read Also : TRS: 'పాంచజన్యం' శంఖంతో ముందుకొచ్చిన కల్వకుంట్ల కవిత

 Swami’s wedding ceremony in Pedda Shankarampet

Pedda Shankarampet Temple: భక్తిశ్రద్ధలతో దివ్య కళ్యాణం

మంగళ వాయిద్యాల నడుమ స్వామివారి కళ్యాణ మహోత్సవం ఘనంగా సాగింది.ఉదయం నుంచే భక్తులు తరలి వచ్చి స్వామివారి దర్శనం చేసుకున్నారు. వేద పండితులు వేద మంత్రోచ్చారణల మధ్య స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం శ్రీ లక్ష్మీ దేవి సమేతంగా వెంకటేశ్వర స్వామి వారి దివ్య కళ్యాణం సంప్రదాయబద్ధంగా జరిపారు.

ఈ సందర్భంగా భక్తుల గోవింద నామస్మరణతో ఆలయ పరిసరాలు మార్మోగాయి. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించి, భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కొండాపూర్ ఆశ్రమ పీఠాధిపతి సంగ్రామ్ మహారాజ్, టిపిసిసి సభ్యులు కర్నె శ్రీనివాస్ శ్రీనివాస్,పట్టణ సర్పంచ్ జంగం రేణుక శ్రీనివాస్, స్థానిక నాయకులు పాల్గొన్నారు.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also :

TRS పేరుతో కొత్త పార్టీ.. బీఆర్ఎస్‌కు కష్టాలు తప్పవా?

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha