Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
TRS పేరుతో కొత్త పార్టీ.. బీఆర్ఎస్‌కు కష్టాలు తప్పవా?

TRS పేరుతో కొత్త పార్టీ.. బీఆర్ఎస్‌కు కష్టాలు తప్పవా?

వార్త 2 months ago

Kavitha New Party: భారత రాష్ట్ర సమితి (BRS) ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. 'తెలంగాణ రాష్ట్ర సేన' (TRS) పేరుతో కొత్త రాజకీయ పార్టీని ప్రకటించి రాష్ట్ర రాజకీయాల్లో హీట్ పెంచారు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తెలంగాణ ఉద్యమ సమయంలో ప్రజల గుండెల్లో బలంగా నాటుకుపోయిన ‘టీఆర్ఎస్’ అనే అక్షరాలనే తన పార్టీ పేరుగా ఎంచుకోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

కవిత పెట్టిన కొత్త పార్టీ వల్ల ప్రస్తుత బీఆర్ఎస్ పార్టీకి భారీ నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని రాజకీయ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. బీఆర్ఎస్ జాతీయ రాజకీయాల వైపు వెళ్లిన తర్వాత, క్షేత్రస్థాయిలో ‘తెలంగాణ’ సెంటిమెంటును కోల్పోయిందనే భావన కొంతమందిలో ఉంది. ఇప్పుడు కవిత మళ్ళీ అదే పాత పేరును (TRS) స్మరిస్తూ పార్టీ పెట్టడం వల్ల, తెలంగాణ వాదులు, ఉద్యమకారులు అటువైపు మొగ్గు చూపే అవకాశం ఉందని భావిస్తున్నారు.

Read Also : Kavitha: రాష్ట్రంలో పీకి కట్టలు కట్టామని అక్కడికి పోయారు: కేసీఆర్‌పై కవిత ఎద్దేవా

Kavitha New Party: కేటీఆర్ నాయకత్వంపై అసంతృప్తే పునాదా?

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నాయకత్వని వ్యతిరేకించే నాయకులకు ఈ కొత్త పార్టీ ఒక ప్రత్యామ్నాయంగా మారుతుందని విశ్లేషణలు వెలువడుతున్నాయి. ముఖ్యంగా బీఆర్ఎస్‌లో తగిన గుర్తింపు లభించని ద్వితీయ శ్రేణి నాయకులు, పార్టీలో అసంతృప్తితో ఉన్న సీనియర్లు కవిత నాయకత్వంలోని ‘తెలంగాణ రాష్ట్ర సేన’లో చేరేందుకు ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది.

ఒకప్పుడు తండ్రి కేసీఆర్ స్థాపించిన పార్టీ పేరును పోలి ఉండేలా కవిత కొత్త పార్టీని ప్రకటించడం వెనుక లోతైన రాజకీయ వ్యూహం ఉన్నట్లు కనిపిస్తోంది. ఇది కుటుంబ రాజకీయాల్లో చీలికను సూచిస్తుందా లేక వ్యూహాత్మకంగా మరో రాజకీయ శక్తిని నిర్మించే ప్రయత్నమా అనేది వేచి చూడాలి. ఏది ఏమైనా, కవిత నిర్ణయంతో తెలంగాణ రాజకీయాల్లో సమీకరణాలు వేగంగా మారుతున్నాయి.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also :

తెలంగాణ రాష్ట్ర సేన పార్టీ

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha