Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
కరాచీకి వెళ్తున్న పాకిస్తానీ కార్గో విమానం అదృశ్యం

కరాచీకి వెళ్తున్న పాకిస్తానీ కార్గో విమానం అదృశ్యం

వార్త 1 month ago

Pakistan Plane Missing: ఐదుగురు సిబ్బందితో ప్రయాణిస్తున్న పాకిస్థాన్‌కు చెందిన 'కే2 ఎయిర్‌వేస్' బోయింగ్ 737 కార్గో విమానం మంగళవారం అరేబియా సముద్రంపై అదృశ్యమవ్వడం అంతర్జాతీయంగా కలకలం సృష్టించింది.

షార్జా నుండి పాక్‌లోని కరాచీ నగరానికి వస్తున్న ఈ సరుకు రవాణా విమానం.. కరాచీ తీరానికి కేవలం 155 నాటికల్ మైళ్ల దూరంలో ఉండగా రాడార్ పరిధి నుంచి తప్పిపోయింది. విమానంలో నావిగేషన్ వ్యవస్థకు సంబంధించిన సాంకేతిక సమస్య తలెత్తినట్లు పైలట్లు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌కు సమాచారం అందించిన కొద్దిసేపటికే ఈ ఘటన చోటుచేసుకుంది.

తెగిపోయిన రాడార్ సంబంధాలు.. రంగంలోకి పాక్ నేవీ, ఎయిర్ ఫోర్స్

పైలట్ల నుండి చివరి సందేశం వచ్చిన వెంటనే విమానంతో రేడియో, రాడార్ సంబంధాలు పూర్తిగా తెగిపోయాయి. శాటిలైట్ ట్రాకింగ్ డేటా ప్రకారం.. చివరి నిమిషంలో ఈ కార్గో విమానం అత్యంత వేగంగా సముద్రం వైపునకు దూసుకువచ్చినట్లు (కిందకు దిగినట్లు) అధికారులు గుర్తించారు. ఈ విమానం సముద్రంలో కూలిపోయిందా లేదా అనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదు. ప్రమాదం తీవ్రతను పరిగణనలోకి తీసుకుని పాకిస్థాన్ నావికాదళం (నేవీ), వాయుసేన (ఎయిర్ ఫోర్స్) అత్యవసరంగా రంగంలోకి దిగాయి. విమానం జాడ కనిపెట్టేందుకు అరేబియా సముద్రంలో యుద్ధనౌకలు, హెలికాప్టర్లతో భారీ స్థాయిలో గాలింపు చర్యలు (సెర్చ్ ఆపరేషన్) చేపట్టాయి.

ఇండోనేషియాలో ప్రంబానన్ ఆలయాన్ని సందర్శించిన ప్రధాని మోదీ

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha