Karnataka New CM: కర్ణాటకలో కొత్త ప్రభుత్వం ఏర్పడింది. ముఖ్యమంత్రిగా డీకే.శివకుమార్ ప్రమాణస్వీకారం చేశారు. రాజధాని బెంగళూరులోని లోక్‌భవన్‌లో సాయంత్రం 4:05 గంటలకు ఈ ప్రతిష్టాత్మక ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది శివకుమార్‌తో గవర్నర్ థావర్‌చంద్ గెహ్లాట్ ప్రమాణస్వీకారం చేయించారు.
శివకుమార్‌తో పాటు దాదాపు 13 మంది ఎమ్మెల్యేలు కూడా మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. కొత్త కేబినెట్‌లో ప్రాంతీయ, సామాజిక సమీకరణాలకు పెద్దపీట వేసినట్లు తెలుస్తోంది. అలాగే సీనియర్ నాయకుడు డాక్టర్ పరమేశ్వర కర్ణాటక ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఈ చారిత్రాత్మక ఘట్టానికి కాంగ్రెస్ అధిష్టానం, ప్రముఖ నేతలు హాజరయ్యారు.
ఏఐసీసీ (AICC) అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్యలతో పాటు పలువురు సీనియర్ నాయకులు ఈ కార్యక్రమానికి విచ్చేశారు.డిప్యూటీ సీఎంగా జి.పరమేశ్వర ప్రమాణస్వీకారం చేయగా.. ప్రియాంక్ ఖర్గే, యతీంద్ర సిద్ధరామయ్య, కె.జె.జార్జ్, కేహెచ్ మునియప్ప, ఎంబీ పాటిల్, రామలింగారెడ్డి, సతీశ్ జర్కిహోళి, కృష్ణబైరి గౌడ, యూటీ.ఖాదిర్, ఈశ్వర్ ఖండ్రే, బైరతి సురేశ్, శరణ్ ప్రకాశ్ పాటిల్ సైతం మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. గత కొంతకాలంగా కర్ణాటక కాంగ్రెస్‌లో సాగిన అంతర్గత చర్చల అనంతరం అధిష్టానం డీకే శివకుమార్ వైపు మొగ్గు చూపింది. సిద్ధరామయ్య స్వచ్ఛందంగా తప్పుకోవడంతో, శివకుమార్‌కు సీఎం పీఠం దక్కింది. ఈ కొత్త ప్రభుత్వ ఏర్పాటుతో కర్ణాటకలో సరికొత్త పాలన సాగనుందని పార్టీ శ్రేణులు ధీమా వ్యక్తం చేస్తున్నాయి.
Read also: Trinamool Party: 'మమతా బెనర్జీ మా నాయకురాలు' అంటూ తృణమూల్ మద్దతు
DK Shivakumar sworn in as new Chief Minister of Karnataka!
Karnataka New CM: డీకే శివకుమార్ రాజకీయ ప్రస్థానం
ఒక సాధారణ రైతు కుటుంబం నుంచి వచ్చి, నేడు రాష్ట్ర ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగిన డీకే శివకుమార్ రాజకీయ ప్రస్థానం మరియు వ్యక్తిగత వివరాలు. డీకే.శివకుమార్ 1962 మే 15న జన్మించారు. కెంపేగౌడ, గౌర అమ్మ దంపతులకు జన్మించారు. 2020 నుంచి కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా పని చేస్తున్నారు. 1993లో ఉషతో వివాహం జరిగింది. వీరికి ఐశ్వర్య, ఆభరణ అనే ఇద్దరు కుమార్తెలు, ఆకాష్ అనే కుమారుడు ఉన్నారు. పెద్ద కుమార్తె ఐశ్వర్య.. ‘కేఫ్ కాఫీ డే’ వ్యవస్థాపకుడు దివంగత సిద్ధార్థ కుమారుడైన అమర్త్యను వివాహం చేసుకుంది. 2008 నుంచి కనకపుర శాసనసభ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అంతకుముందు 1989 నుంచి 2008 వరకు సాతనూరు శాసనసభ్యుడిగా పని చేశారు. 2020 నుంచి కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (KPCC) అధ్యక్షుడిగా విజయవంతంగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. గతంలో 2008 నుంచి 2010 వరకు వర్కింగ్ ప్రెసిడెంట్‌గానూ సేవలు అందించారు. 2014 నుంచి 2019 వరకు కర్ణాటక ప్రభుత్వంలో కేబినెట్ మంత్రిగా కీలక పోర్ట్‌ఫోలియోలను నిర్వహించారు. ఈ కొత్త ప్రభుత్వ ఏర్పాటుతో కర్ణాటకలో సరికొత్త సంక్షేమ పాలన, అభివృద్ధి సాగనుందని కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ధీమా వ్యక్తం చేస్తున్నాయి.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read also:
కర్ణాటక రాజకీయాల్లో మార్పులు: సీడబ్ల్యూసీ సభ్యుడిగా సిద్ధరామయ్య నియామకం

