Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
కర్ణాటక రాజకీయాల్లో పెను సంచలనం.. కొత్త సీఎం పై ఉత్కంఠ

కర్ణాటక రాజకీయాల్లో పెను సంచలనం.. కొత్త సీఎం పై ఉత్కంఠ

వార్త 2 months ago

Karnataka Politics: కర్ణాటక ల్లో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. గురువారం నాడు బెంగళూరులోని తన అధికారిక నివాసంలో కేబినెట్ సహచరులకు ఏర్పాటు చేసిన అల్పాహార విందు (బ్రేక్‌ఫాస్ట్ మీటింగ్) లో ఆయన ఈ సంచలన నిర్ణయాన్ని వెల్లడించారు.

ఈ నిర్ణయంతో కర్ణాటకలో కొత్త ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టేందుకు మార్గం సుగమమైంది.

Read Also : Karnataka CM Resign : సిద్దరామయ్య రాజీనామా వ్యవహారంలో ట్విస్ట్!

 Big sensation in Karnataka politics.. Excitement over the new CM

Karnataka Politics: సీఎం సిద్ధరామయ్య కాళ్లు మొక్కిన డీకే శివకుమార్

ఈ అల్పాహార సమావేశానికి రాష్ట్ర డిప్యూటీ సీఎం, సిద్ధరామయ్య వారసుడిగా భావిస్తున్న డీకే శివకుమార్‌తో పాటు కేబినెట్ మంత్రులందరూ హాజరయ్యారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కార్యాలయం (CMO) రెండు ఆసక్తికరమైన చిత్రాలను పంచుకుంది. అందులో ఒక ఫోటోలో సిద్ధరామయ్య, డీకే శివకుమార్‌ను ఆత్మీయంగా ఆలింగనం చేసుకోగా.. మరో ఫోటోలో కాబోయే ముఖ్యమంత్రిగా భావిస్తున్న శివకుమార్, సిద్ధరామయ్య పాదాలకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకుంటూ కనిపించారు.

రాష్ట్రంలో నాయకత్వ మార్పు జరగాలని, డీకే శివకుమార్‌కు ముఖ్యమంత్రి పీఠాన్ని అప్పగించాలని కాంగ్రెస్ హైకమాండ్ కోరినట్లు సమాచారం. అధిష్టానం ఆదేశాలను గౌరవిస్తూ 77 ఏళ్ల సీనియర్ నాయకుడు సిద్ధరామయ్య ఈ అల్పాహార సమావేశంలోనే తన రాజీనామా నిర్ణయాన్ని సహచరులకు వివరించారు. ఈ కీలక పరిణామాలపై గురువారం రోజే మీడియాతో మాట్లాడనున్నట్లు ఆయన గతంలోనే స్పష్టం చేశారు.

రాజీనామా ప్రకటించిన సిద్ధరామయ్య

ముఖ్యమంత్రి పదవికి రాజీనామా ప్రకటించిన సిద్ధరామయ్య.. తన రాజీనామా పత్రాన్ని సమర్పించేందుకు వీలుగా రాష్ట్ర గవర్నర్ థావర్‌చంద్ గెహ్లాట్ అపాయింట్‌మెంట్ కోరారు. అయితే, ప్రస్తుతం గవర్నర్ బెంగళూరు నగరంలో లేకపోవడం గమనార్హం. ఆయన వ్యక్తిగత కారణాలతో మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌కు వెళ్లినట్లు లోక్‌భవన్ వర్గాలు ధృవీకరించాయి. దీంతో గవర్నర్ తిరిగి నగరానికి చేరుకున్న వెంటనే సిద్ధరామయ్య తన రాజీనామాను అధికారికంగా సమర్పించనున్నారు.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also :

పేషెంట్‌తో అక్రమ సంబంధం.. UKలో భారత సంతతి వైద్యుడిపై 8 నెలల సస్పెన్షన్ వేటు!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha