Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
కర్ణాటక సీఎంగా డీకే శివకుమార్ జూన్ 3న ప్రమాణ స్వీకారం

కర్ణాటక సీఎంగా డీకే శివకుమార్ జూన్ 3న ప్రమాణ స్వీకారం

వార్త 0 months ago

DK Shivakumar: కర్ణాటక రాజకీయాల్లో కీలక ఘట్టం ఆవిష్కృతం కాబోతోంది. రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారం చేసేందుకు ముహూర్తం ఖరారైంది.

జూన్ 3వ తేదీ సాయంత్రం 5:15 గంటలకు ఆయన సీఎంగా బాధ్యతలు స్వీకరించనున్నారు. ప్రముఖ వాస్తు, జ్యోతిష్య నిపుణులు గురూజీ ఆరాధ్య స్వయంగా ఈ శుభ ముహూర్తాన్ని నిర్ణయించినట్లు శనివారం అధికారికంగా వెల్లడించారు.

 Guruji Aaradhya Muhurtham

Read also:Patanjali Products Seize: బాబా రాందేవ్‌కు భారీ షాక్..పతంజలి ఉత్పత్తులను సీజ్ చేసిన ఎఫ్‌డీఏ అధికారులు

ముహూర్తం వెనుక ఆసక్తికర అంశాలు!

డీకే శివకుమార్ నివాసం వద్ద గురూజీ ఆరాధ్య మీడియాతో మాట్లాడుతూ.. జూన్ 3 (బుధవారం) నాటి వృశ్చిక లగ్నం ప్రమాణ స్వీకారానికి అత్యంత శుభప్రదంగా ఉందని పేర్కొన్నారు. నిజానికి జూన్ 5వ తేదీని కూడా పరిశీలించినప్పటికీ, ఆ రోజున ఒక ముఖ్యనేత అందుబాటులో ఉండరనే కారణంతో జూన్ 3వ తేదీనే ఫైనల్ చేసినట్లు ఆయన వివరించారు. డీకేఎస్ జాతక చక్రం, జ్యోతిష్య గణాంకాలను బేరీజు వేసుకున్న తర్వాతే ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.

DK Shivakumar: సిద్ధరామయ్య ప్రతిపాదన.. ఏకగ్రీవంగా ఎన్నికైన డీకే శివకుమార్

ముహూర్తం ఖరారైన నేపథ్యంలో డీకే శివకుమార్ బెంగళూరులోని ప్రసిద్ధ అజ్జయ్య మఠాన్ని సందర్శించి, అక్కడి స్వామీజీ ప్రత్యేక ఆశీస్సులు తీసుకున్నారు. అంతకుముందు ఆయన రాజ్ భవన్‌లో గవర్నర్ థావర్‌చంద్ గెహ్లాట్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. మరోవైపు, కాంగ్రెస్ శాసనసభాపక్ష (CLP) నేతగా డీకే శివకుమార్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ప్రస్తుత ముఖ్యమంత్రి సిద్ధరామయ్య స్వయంగా సీఎల్పీ నేతగా డీకేఎస్ పేరును ప్రతిపాదించగా, కాంగ్రెస్ ఎమ్మెల్యేలందరూ దాన్ని ఏకగ్రీవంగా బలపరిచారు.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read also:

రాజస్థాన్‌ను వణికించిన ఇసుక తుపాను.. ఆపై భారీ వర్షం

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha