తెలంగాణతో పాటు దేశంలోని పలు రాష్ట్రాల్లో నిషేధిత చైనా మాంజా(Chinese manjha) వినియోగం వల్ల ప్రాణాపాయ ఘటనలు కొనసాగుతున్నాయి. తాజాగా కర్ణాటక రాష్ట్రం( Karnataka ) బీదర్ జిల్లాలో మరో విషాదకర సంఘటన చోటుచేసుకుంది.
బైక్‌పై ప్రయాణిస్తున్న సంజు కుమార్ హోసమణి (48) అనే వ్యక్తి గొంతుకు చైనా మాంజా తగలడంతో తీవ్ర గాయాలపాలయ్యాడు.
Read Also: TG Crime: డీసీఎంను ఢీకొన్న ఆర్టీసీ బస్సు .. పలువురికి గాయాలు

అంబులెన్స్ రాకముందే మృతి
రక్తస్రావం అధికంగా జరిగి, అంబులెన్స్ వచ్చేలోపే ఆయన మృతి చెందినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై స్థానిక ప్రజలు తీవ్ర ఆవేదన, ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చైనా మాంజా విక్రయాలపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను కోరుతున్నారు. ప్రమాదానికి సంబంధించిన వివరాలపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Sangareddy: బైక్‌పై వెళ్తున్న వ్యక్తి ప్రాణం తీసిన చైనా మాంజా

