Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Karnataka: జ్యోతిష్కుడి మాటలు నమ్మి కన్నతల్లినే చంపిన కూతురు

Karnataka: జ్యోతిష్కుడి మాటలు నమ్మి కన్నతల్లినే చంపిన కూతురు

వార్త 4 months ago

ర్ణాటక (Karnataka) రాష్ట్రంలో చోటుచేసుకున్న ఓ దారుణ ఘటన చోటు చేసుకుంది.. మూఢనమ్మకాలు, జ్యోతిష్యుల మాటలు నమ్మిన ఓ కుమార్తె కన్నతల్లినే హత్య చేసిన సంఘటన కర్ణాటకలోని తుమకూరు జిల్లాలో తీవ్ర సంచలనం సృష్టించింది.

తుమకూరు నగరంలో నివసిస్తున్న 33 ఏళ్ల సుచిత్ర తండ్రి ఏడాదిన్నర కిందట మరణించాడు. సుచిత్ర ఇటీవల ఒక జ్యోతిష్కుడిని సంప్రదించగా.. ఆమె తల్లి పుష్పవతి(55) చేతబడి చేయించడం వల్ల తండ్రి మరణించాడని అతడు చెప్పాడు.

Forced marriage india : బీహార్‌లో కిడ్నాప్ పెళ్లి కలకలం

కేసు నమోదు

అనుపనహళ్లి గ్రామంలో నివసించే తల్లి ఇంటికి ఆమె చేరుకుని బుధవారం తల్లి ముఖంపై దిండుతో నొక్కి ఊపిరాడకుండా చేసి చంపింది. అనంతరం తన తల్లి సహజంగా మరణించినట్లు నమ్మించేందుకు సుచిత్ర ప్రయత్నించింది. తల్లి మృతదేహానికి హడావుడిగా అంత్యక్రియలు నిర్వహిచేందుకు ప్రయత్నించింది. అయితే పుష్పవతి శరీరంపై గాయాల గుర్తులు ఉండటంతో ఆమె మరణంపై స్థానికులు అనుమానించారు. పోలీసులకు సమాచారం ఇచ్చారు.మరోవైపు పోలీసులు ఆ ఇంటికి చేరుకున్నారు.

పుష్పవతి మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం తరలించారు. సుచిత్రను ప్రశ్నించగా జ్యోతిష్కుడి మాటలు నమ్మి తల్లిని తానే చంపినట్లు ఒప్పుకున్నదని పోలీస్‌ అధికారి తెలిపారు. దీంతో ఆమెను అరెస్ట్‌ చేసి కేసు నమోదు చేసినట్లు చెప్పారు. ఈ హత్యలో ఆమె భర్త పాత్ర ఏమైనా ఉన్నదా? అన్నది కూడా దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.స్థానికుల సమాచారంతో పోలీసులు అక్కడికి చేరుకుని సుచిత్రను ప్రశ్నించగా నేరం చేసినట్లు ఒప్పుకుంది.Read hindi news: hindi.vaartha.com

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha