Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Bihar: విషం రుచి చూసి నలుగురు బాలికలు మృతి

Bihar: విషం రుచి చూసి నలుగురు బాలికలు మృతి

వార్త 4 months ago

బీహార్‌ (Bihar) లో చోటుచేసుకున్న ఓ విషాద ఘటన కలచివేసింది. విషం రుచి ఎలా ఉంటుందో తెలుసుకోవాలన్న బాల్యపు ఆసక్తి నలుగురు బాలికల ప్రాణాలను బలిగొంది.

ఈ ఘటన బీహార్ రాష్ట్రంలోని ఔరంగాబాద్ జిల్లా పరిధిలోని మోతీబీగా గ్రామంలో జరిగింది.12 నుంచి 15 ఏళ్ల మధ్య వయస్సున్న బాలికలు విషం రుచి చూడటం కోసం పక్షులను చంపేందుకు ఉపయోగించే విషాన్ని నీటిలో కలిపి తాగారు.

Jaipur: డ్రైవర్‌ నిర్లక్ష్యం ప్రాణం తీసింది.. అసలేం జరిగింది?

కేసు నమోదు

వారిలో 14 ఏళ్ల బాలిక కొద్దిగా మాత్రమే తాగి వెంటనే ఉమ్మేయడంతో ప్రాణాపాయం తప్పింది. 14 ఏండ్ల బాలిక కథనం ప్రకారం..12-15 ఏండ్లు ఉన్న ఐదుగురు బాలికల మిత్ర బృందానికి విషం రుచి ఏమిటో తెలుసుకోవాలన్న ఆసక్తి కలిగింది. దీంతో పక్షులను చంపే విషాన్ని తీసుకుని ఏకాంత ప్రదేశానికి వెళ్లి నీటిలో కలుపుకుని తాగారు. అయితే 14 ఏండ్ల బాలిక మాత్రం కొద్దిగానే తీసుకుంది. పైగా దానిని తాగిన వెంటనే ఊసేసింది. దీంతో కొద్దిగా అస్వస్థత తప్ప ఆమె ప్రాణాలకు ఎలాంటి ప్రమాదం రాలేదు. మిగిలిన నలుగురు బాలికలు మృతిచెందారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha