Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
కర్నూలు రోడ్డు ప్రమాదం.. ప్రధాని మోదీ విచారం: ఎక్స్‌గ్రేషియా ప్రకటన

కర్నూలు రోడ్డు ప్రమాదం.. ప్రధాని మోదీ విచారం: ఎక్స్‌గ్రేషియా ప్రకటన

వార్త 2 months ago

Kurnool Accident: కర్నూలు: జిల్లాలోని మంత్రాలయం మండలం చిలకలడోన వద్ద గురువారం తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై భారత ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు.

కర్ణాటకకు చెందిన యాత్రికులు ప్రయాణిస్తున్న వాహనం ప్రమాదానికి గురై ఎనిమిది మంది మృతి చెందడంపై ఆయన దిగ్భ్రాంతి చెందారు.

Read Also:Bhuvanagiri crime: రెండేళ్ల కూతురిని గొంతు నులిమి చంపిన కసాయి తండ్రి!

Kurnool Accident: ప్రధాని మోదీ సంతాపం

ఈ ఘటనపై ప్రధాని కార్యాలయం (PMO) ఎక్స్ (గతంలో ట్విట్టర్) వేదికగా స్పందించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, కర్నూలు జిల్లాలో జరిగిన ప్రమాదం అత్యంత విషాదకరం. ఈ దుర్ఘటన లో తమ ఆత్మీయులను కోల్పోయిన వారికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను.ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు రూ. 2 లక్షలు, గాయపడిన వారికి రూ. 50,000 ఎక్స్ గ్రేషియా పిఎంఎన్ఆర్ఎఫ్ నుండి ఇవ్వబడుతుంది అని పేర్కొన్నారు.

ప్రమాదం ఎలా జరిగింది?

కర్ణాటక రాష్ట్రం నుంచి మంత్రాలయం రాఘవేంద్రస్వామి దర్శనం కోసం కొంతమంది భక్తులు బొలేరో వాహనంలో బయలుదేరారు. చిలకలడోణ గ్రామం సమీపానికి చేరుకోగానే, ఎదురుగా వస్తున్న లారీ - బొలేరో వాహనం అత్యంత వేగంతో ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాద దాటికి బొలేరో వాహనం నుజ్జునుజ్జయ్యింది. ప్రమాద తీవ్రత ఎంతలా ఉందంటే, ఐదుగురు భక్తులు అక్కడికక్కడే మరణించగా, తీవ్ర గాయాలపాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరో ముగ్గురు కన్నుమూశారు. మృతులంతా కర్ణాటకకు చెందిన వారిగా పోలీసులు ధృవీకరించారు.

క్షతగాత్రుల పరిస్థితి విషమం.. కొనసాగుతున్న చికిత్స

ఈ ప్రమాదంలో మరో పది మంది తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు మరియు పోలీసులు స్పందించి క్షతగాత్రులను ఎమ్మిగనూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ప్రమాద ధాటికి వాహనంలో ఇరుక్కుపోయిన వారిని బయటకు తీసేందుకు పోలీసులు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించిన అధికారులు, బాధితుల కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.

అతివేగమే ప్రమాదానికి కారణమా?

ప్రాథమిక సమాచారం ప్రకారం, అతివేగం,అజాగ్రత్తే ఈ ఘోర ప్రమాదానికి కారణమని భావిస్తున్నారు. మంత్రాలయం వెళ్లే రహదారిపై వాహనాల రద్దీ ఎక్కువగా ఉండటం, పైగా మలుపుల వద్ద అప్రమత్తంగా లేకపోవడం వల్ల ఈ దుర్ఘటన జరిగినట్లు తెలుస్తోంది. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. పుణ్యక్షేత్రానికి వెళ్తూ ఇలా మార్గమధ్యలోనే ప్రాణాలు కోల్పోవడం భక్తులను, స్థానికులను తీవ్రంగా కలచివేస్తోంది.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

కోతిని తరిమేందుకు యత్నించి.. హైటెన్షన్ వైర్లు తగిలి యువకుడు మృతి!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha