Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
కర్నూలులో ఘోర ప్రమాదం: ఏపీఎస్పీ హెడ్ కానిస్టేబుల్ దుర్మరణం!

కర్నూలులో ఘోర ప్రమాదం: ఏపీఎస్పీ హెడ్ కానిస్టేబుల్ దుర్మరణం!

వార్త 3 weeks ago

Kurnool Road Accident: జిల్లా కేంద్రంలో మంగళవారం తెల్లవారుజామున ఒక ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. నిత్యం ప్రజల రక్షణలో ఉండే ఒక పోలీస్ అధికారి, ఉదయాన్నే జాగింగ్ చేస్తుండగా గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.

ఈ హృదయవిదారక ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

Read Also:Delhi Crime: నడిరోడ్డుపై కాపాడాల్సిన ఖాకీనే కాలయముడయ్యాడు.. భార్యను కాల్చేసి కానిస్టేబుల్

ఫ్లైఓవర్‌పై నుంచి కిందపడి ప్రాణాలు కోల్పోయిన వరప్రసాద్ రెడ్డి

పోలీసుల సమాచారం ప్రకారం.. ఏపీఎస్పీ (APSP) రెండో బెటాలియన్‌కు చెందిన హెడ్ కానిస్టేబుల్ వరప్రసాద్ రెడ్డి మంగళవారం తెల్లవారుజామున ఎప్పటిలాగే శారీరక వ్యాయామం కోసం బయటకు వచ్చారు. నగరంలోని బళ్లారి చౌరస్తా వద్ద ఉన్న జాతీయ రహదారిపై ఆయన జాగింగ్ చేస్తుండగా.. అత్యంత వేగంగా వచ్చిన ఒక గుర్తుతెలియని వాహనం ఆయన్ను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదం జరిగిన వేగానికి వరప్రసాద్ రెడ్డి ఫ్లైఓవర్‌పై నుంచి ఒక్కసారిగా కింద రోడ్డుపై పడిపోయారు. తలకు, శరీరానికి తీవ్రమైన గాయాలు కావడంతో ఆయన ఘటనా స్థలంలోనే ప్రాణాలు విడిచారు.

Kurnool Road Accident: పోలీసుల గాలింపు చర్యలు

రోడ్డుపై మృతదేహాన్ని గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. దీంతో హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పరిస్థితిని సమీక్షించారు. అనంతరం భౌతికకాయాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఉదయం పూట తోటి పోలీస్ అధికారి ఇలా రోడ్డు ప్రమాదానికి గురై మరణించడంతో బెటాలియన్ వర్గాల్లో విషాద ఛాయలు అలముకున్నాయి. ఈ ఘోర ప్రమాదంపై కేసు నమోదు చేసిన పోలీసులు.. సీసీటీవీ (CCTV) ఫుటేజీల ఆధారంగా హెడ్ కానిస్టేబుల్‌ను ఢీకొట్టి ఆపకుండా వెళ్ళిపోయిన అపరిచిత వాహనాన్ని గుర్తించేందుకు గాలింపు చర్యలు చేపట్టారు.

Epaper: epaper.vaartha.com

Shabad Murder Case: షాబాద్ ఘటన.. రాజ్ కుమార్ మృతి

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha