Delhi Crime: దేశ రాజధాని ఢిల్లీలో పుట్టినరోజే ఓ మహిళకు నూరేళ్లు నిండాయి. నడిరోడ్డుపై భార్యను ఓ కానిస్టేబుల్ కాల్చి చంపిన దారుణ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
సోమవారం తెల్లవారుజామున కల్యాణ్‌పురి ప్రాంతంలో ఈ ఘోరం చోటుచేసుకుంది.
Read Also:Uttar Pradesh: ఇదేం అన్యాయం! పుట్టింటికి వెళ్తానన్న భార్య ముక్కు కోసిన భర్త
Delhi Crime: పుట్టినరోజే విగతజీవిగా

కల్యాణ్‌పురి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. ఢిల్లీ పోలీస్ శాఖలో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న మనీశ్ భాటి, తన భార్య ప్రియాంకతో కలిసి సోమవారం తెల్లవారుజామున స్కూటర్‌పై వెళ్తున్నాడు. ఈ క్రమంలోనే దంపతులిద్దరి మధ్య ఏదో విషయమై తీవ్ర గొడవ జరిగింది. స్కూటర్ నడుపుతుండగానే ఇద్దరి మధ్య వాగ్వాదం పెరగడంతో ఆగ్రహానికి గురైన మనీశ్ భాటి.. వాహనాన్ని రోడ్డు పక్కన ఆపాడు. వెంటనే తన వద్ద ఉన్న తుపాకీ తీసి భార్య ప్రియాంకపై కాల్పులు జరిపాడు. ఆమె రక్తపు మడుగులో కింద పడిపోగానే అక్కడి నుంచి బైక్‌పై పారిపోయినట్లు ప్రత్యక్ష సాక్షులు పోలీసులకు తెలిపారు. రోడ్డుపై తీవ్ర గాయాలతో పడి ఉన్న ప్రియాంకను స్థానికులు, పోలీసులు వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అయితే అక్కడ అత్యవసర విభాగంలో చికిత్స పొందుతూ ఆమె పరిస్థితి విషమించి కన్నుమూసింది. విచారకరమైన విషయం ఏంటంటే.. హత్యకు గురైన సోమవారమే (జులై 13) ప్రియాంక పుట్టినరోజు కావడంతో కుటుంబంలో తీవ్ర విషాదం నిండింది.
Epaper: epaper.vaartha.com

