Karuppu Movie: కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ప్రధాన పాత్రలో, ఆర్‌జే బాలాజీ దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'కరుప్పు'. మే 14న ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదల కావాల్సిన ఈ సినిమాకు ఆరంభంలోనే పెద్ద అడ్డంకి ఎదురైంది.
రిలీజ్ రోజు ఉదయం ప్రదర్శితం కావాల్సిన ఎర్లీ మార్నింగ్ షోలన్నీ రద్దు కావడంతో అభిమానులు తీవ్ర నిరాశకు లోనయ్యారు.
ఆర్థిక చిక్కుల్లో ‘కరుప్పు’
డ్రీమ్ వారియర్ పిక్చర్స్ నిర్మించిన ఈ చిత్రం విడుదల నిలిచిపోవడానికి ప్రధాన కారణం ఆర్థిక సమస్యలేనని తెలుస్తోంది. సుమారు రూ. 50 కోట్ల మేర బకాయిలు ఉండటంతో ఫైనాన్షియల్ క్లియరెన్స్ లభించలేదని సమాచారం. ఈ బకాయిల సెటిల్‌మెంట్ కాకపోవడం వల్లే సినిమా విడుదలకు అడ్డంకులు ఏర్పడ్డాయి. నిర్మాతలు ఎస్ఆర్ ప్రభు, ఎస్ఆర్ ప్రకాష్ బాబు ఈ సమస్యను పరిష్కరించడానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు.
Read Also : Tollywood : హీరోలకు బిగ్ షాక్ ?
The release of ‘Karuppu’ was canceled at the last minute.. What happened?
Karuppu Movie: రిఫండ్స్ ప్రక్రియ
సినిమా వాయిదా పడటంతో అటు భారత్‌లోనూ, ఇటు ఓవర్సీస్‌లోనూ ప్రీమియర్ షోలు రద్దు అయ్యాయి. ఇప్పటికే ఆన్‌లైన్ టికెటింగ్ ప్లాట్‌ఫారమ్‌ల నుండి షోల వివరాలను తొలగించడమే కాకుండా, అడ్వాన్స్ బుకింగ్ చేసుకున్న ప్రేక్షకులకు నగదు తిరిగి చెల్లించే ప్రక్రియను ప్రారంభించారు. సినిమాపై మంచి హైప్ ఉన్న తరుణంలో ఇలా జరగడం ట్రేడ్ వర్గాలను సైతం విస్మయానికి గురిచేసింది.
నిర్మాత, దర్శకుడి వివరణ
ఈ గందరగోళంపై నిర్మాత ఎస్‌ఆర్ ప్రభు స్పందిస్తూ.. “తప్పనిసరి పరిస్థితుల వల్ల ఉదయం 9 గంటల వరకు ఉన్న షోలను రద్దు చేయాల్సి వచ్చింది. ఈ అసౌకర్యానికి క్షమాపణలు కోరుతున్నాం” అని సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. దర్శకుడు ఆర్‌జే బాలాజీ కూడా నిర్మాతలు సమస్యను చక్కదిద్దే పనిలో ఉన్నారని పేర్కొన్నారు. సమస్య పరిష్కారమైతే మధ్యాహ్నం లేదా రేపటి నుండి సినిమా థియేటర్లలోకి వచ్చే అవకాశం ఉంది.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also :

