Dailyhunt
ఉప్పల్ లో సన్‌రైజర్స్ తడబాటు: 156 పరుగులకే పరిమితమైన ఆరెంజ్ ఆర్మీ

ఉప్పల్ లో సన్‌రైజర్స్ తడబాటు: 156 పరుగులకే పరిమితమైన ఆరెంజ్ ఆర్మీ

వార్త 2 weeks ago

SRH vs LSG Match Score: ఐపీఎల్ 2026లో భాగంగా ఉప్పల్ స్టేడియంలో జరుగుతున్న ఉత్కంఠభరిత పోరులో సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) నిర్ణీత 20 ఓవర్లలో 156 పరుగులు స్కోరు సాధించింది.

తొలుత తడబడినప్పటికీ, మిడిల్ ఆర్డర్ బ్యాటర్లు అద్భుతంగా ఆదుకోవడంతో లక్నో సూపర్ జెయింట్స్ (LSG) ముందు 157 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది.

Read Also: SRH vs LSG match updates: షమీ బౌలింగ్‌లో అభిషేక్ శర్మ అవుట్!

 SRH vs LSG

టాస్ ఓడిన సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను ఆరంభంలోనే మహమ్మద్ షమీ(2-9) దెబ్బకొట్టాడు. విధ్వంసక ఓపెనర్లు అభిషేక్ శర్మ(0)ను డకౌట్‌గా వెనక్కి పంపిన షమీ.. కాసేపటికే ట్రావిస్ హెడ్‌(7)ను వెనక్కి పంపాడు. ఆ షాక్ నుంచి తేరుకునేలోపే ఇషాన్ కిషన్‌(1)ను ప్రిన్స్ యాదవ్ క్లీన్‌ బౌల్డ్ చేశాడు. వెంటట వెంటనే మూడు వికెట్లు పడిన వేళ లియాం లివింగ్‌స్టోన్(14) స్కూప్ షాట్‌కు ప్రయత్నించి రిషభ్ పంత్ చేతికి చిక్కాడు. 26 పరుగులకే నాలుగు కీలక వికెట్లు పడడంతో హెన్రిచ్ క్లాసెన్( నాటౌట్), నితీశ్ రెడ్డి(4 నాటౌట్)లు సన్‌రైజర్స్‌ను ఆదుకున్నారు. వికెట్ల పతనాన్ని అడ్డుకోవడంతో పది ఓవర్లకు స్కోర్.. 35-4.

SRH vs LSG Match Score: గేర్ మార్చి.. స్కోర్‌బోర్డును ఉరికించి

ప్రిన్స్ ఓవర్లో చెరొక సిక్సర్లతో స్కోర్ 50 దాటించారు. ఆపై రథీ బౌలింగ్‌లో రెడ్డి వరుసగా రెండు ఫోర్లు బాదాడు. ఇక నా వంతు అన్నట్టు 14వ ఓవర్ అవేశ్ ఖాన్‌కు చుక్కలు చూపించిన క్లాసెన్ నాలుగు ఫోర్లతో రెచ్చిపోయాడు. వీరిద్దరి విధ్వంసంతో రన్‌రేటు ఆరుకు చేరింది.వైల్డ్‌ఫైర్ ఆటతో లక్నో బౌలర్లను వణికించిన నితీశ్, క్లాసెన్‌ ఒకరి వెంట ఒకరు వెనుదిరిగారు. హర్ష్‌ దూబే(0)ను బౌల్డ్ చేసి హ్యాట్రిక్‌పై నిలిచాడు. చివరి ఓవర్లో కుషాంగ్‌(4)ను ప్రిన్స్ బౌల్డ్ చేసినా.. హర్షల్ పటేల్(4) వస్తూనే ఫోర్ రాబట్టాడు. చివరి రెండు బంతులకు ఒకే రన్‌ రావడంతో సన్‌రైజర్స్ నిర్ణీత ఓవర్లలో 156 పరుగులకే పరిమితమైంది.

Read Also hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

3 వికెట్లు కోల్పోయిన సన్‌రైజర్స్!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha