Trainee IPS Uday krishnareddy Custody Ends : హైదరాబాద్‌లోని సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీ (SVPNPA) లో సహచర మహిళా ట్రైనీ ఐపీఎస్‌ను లైంగికంగా వేధించిన ఆరోపణలు ఎదుర్కొంటున్న ట్రైనీ ఐపీఎస్ ఉదయ్‌కృష్ణారెడ్డి రెండు రోజుల పోలీస్ కస్టడీ పూర్తయింది.
ఉమెన్ సేఫ్టీ వింగ్ డీసీపీ లావణ్యనాయక్ ఆధ్వర్యంలో అత్తాపూర్ పోలీస్ స్టేషన్‌లో జరిగిన ఈ విచారణలో నిందితుడు సహకరించకుండా విచారణను పక్కదోవ పట్టించే ప్రయత్నం చేసినట్లు అధికారులు తెలిపారు.
Read Also: Mahalakshmi Scheme : మరో 5 లక్షల మందికి రూ.500కే వంట గ్యాస్!
Trainee IPS Uday krishnareddy Custody Ends
Trainee IPS Uday krishnareddy Custody Ends : ఐఫోన్, సోషల్ మీడియా పోస్టులపై దాటవేత
విచారణ సందర్భంగా కేసులోని కీలక ఆధారమైన ఐఫోన్ గురించి పోలీసులు ప్రశ్నించగా.. అది ఎక్కడో పడిపోయిందని, తనకు తెలియదని ఉదయ్‌కృష్ణారెడ్డి సమాధానమిచ్చారు. ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టిన వివాదాస్పద పోస్టులు, ల్యాప్‌టాప్‌లో దాచిన సమాచారం, సూసైడ్ నోట్‌లోని అంశాలపై ఆరా తీస్తే “ఏమీ గుర్తులేదు, మర్చిపోయాను” అంటూ దాటవేత వైఖరి ప్రదర్శించారు. కస్టడీ గడువు ముగియడంతో ఉప్పరపల్లి (రాజేంద్రనగర్) కోర్టులో పోలీసులు ఉదయ్‌ను హాజరుపరిచారు. విచారణలో కీలక సమాచారం రాబట్టాల్సి ఉన్నందున మరోమారు కస్టడీ ఇవ్వాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. కాగా, విచారణ సమయంలో అధికారులు తనతో అభ్యంతరకరంగా మాట్లాడి బెదిరించారని కోర్టులో న్యాయమూర్తి ఎదుట నిందితుడు వాపోయారు. న్యాయమూర్తి విచారణ అనంతరం నిందితుడిని చంచల్‌గూడ జైలుకు తరలించాలని ఆదేశించారు.
ORR వద్ద బ్రిడ్జి పిల్లర్‌ను ఢీకొట్టిన కారు.. ఇద్దరు దుర్మరణం

