Bandi Bhagirath case: తెలంగాణలో సంచలనం సృష్టించిన బండి భగీరథ్ పోక్సో (POCSO) కేసులో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. నిందితుడు భగీరథ్‌ను విచారించేందుకు పోలీసులు దాఖలు చేసిన కస్టడీ పిటిషన్‌పై విచారణను మల్కాజ్‌గిరి పోక్సో ప్రత్యేక న్యాయస్థానం ఈ నెల 26వ తేదీకి వాయిదా వేసింది.
Read Also :Rangareddy crime: గర్భం దాల్చిన మైనర్ విద్యార్థిని.. నిందితుడిపై పోక్సో కేసు నమోదు
అసలు ఏం జరిగిందంటే..?
Petbasheerabad Police
బాధిత బాలిక తల్లి ఇచ్చిన అధికారిక ఫిర్యాదు మేరకు.. ఈ నెల 8వ తేదీన పేట్‌బషీరాబాద్ పోలీస్ స్టేషన్‌లో బండి భగీరథ్‌పై పోక్సో చట్టం కింద కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఈ కేసు ఆధారంగా పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. నిందితుడిని కస్టడీలోకి తీసుకుని మరిన్ని వివరాలు సేకరించాలని భావించిన పోలీసులు మల్కాజ్‌గిరి కోర్టును ఆశ్రయించగా, ఆ విచారణ ప్రస్తుతానికి వాయిదా పడింది.
Bandi Bhagirath case: హైకోర్టులో భగీరథ్‌కు ఊరట
మరోవైపు, ఈ కేసులో నిందితుడు బండి భగీరథ్‌కు ఉన్నత న్యాయస్థానంలో స్వల్ప ఉపశమనం లభించింది. ఈ కేసులో రెగ్యులర్ బెయిల్ (Regular Bail) కొరకు దరఖాస్తు చేసుకోవడానికి తెలంగాణ హైకోర్టు అతనికి అనుమతి మంజూరు చేసింది. దీనితో భగీరథ్ తరఫు న్యాయవాదులు త్వరలోనే బెయిల్ పిటిషన్ దాఖలు చేసేందుకు సిద్ధమవుతున్నారు.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also :
దళిత యువతిపై బలవంతపు మతమార్పిడి, కొన్నేళ్లుగా సామూహిక అత్యాచారం!

