కవితకు కోర్టు సమన్లు
Telangana Political : తెలంగాణ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవితకు కోర్టు సమన్లు జారీ అయ్యాయి.
బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ కామారెడ్డిలో నిర్వహించిన రైల్ రోకో కార్యక్రమం ఇప్పుడు న్యాయపరమైన మలుపు తీసుకుంది. ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్న కవితపై రైల్వే పోలీసులు కేసు నమోదు చేశారు. రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగించడం, నిబంధనలు ఉల్లంఘించడం వంటి ఆరోపణలతో కల్వకుంట్ల కవితతో పాటు మరో 12 మందిపై రైల్వే యాక్ట్‌లోని యూ/సెక్షన్ 147, 74(ఏ) కింద కేసులు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు.
కోర్టుకు వ్యక్తిగత హాజరు ఆదేశం
ఈ కేసు విచారణలో భాగంగా సికింద్రాబాద్‌లోని సెకండ్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ ఆఫ్ ఫస్ట్ క్లాస్ కోర్టు కవితకు సమన్లు జారీ చేసింది. రేపు ఉదయం 10.30 గంటలకు వ్యక్తిగతంగా కోర్టుకు హాజరు కావాలని న్యాయస్థానం ఆదేశించింది. ఈ పరిణామం తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. బీసీ రిజర్వేషన్ల అంశంపై కవిత ఇటీవల తీవ్ర స్థాయిలో ఉద్యమాలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో రైల్ రోకో కార్యక్రమం కూడా రాష్ట్రవ్యాప్తంగా ప్రాధాన్యం సంతరించుకుంది.
Read Also:Sanatana Dharma: సనాతన ధర్మంపై తగ్గేదే లేదన్న ఉదయనిధి
Telangana Politicalబీసీ రిజర్వేషన్లపై కొనసాగుతున్న ఉద్యమం
బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ రక్షణ సేన ఆధ్వర్యంలో పలు నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయి. ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడమే లక్ష్యంగా రైల్ రోకో చేపట్టినట్లు ఆ సంస్థ నేతలు పేర్కొన్నారు. అయితే రైల్వే సేవలకు అంతరాయం కలిగించడంతో పోలీసులు చట్టపరమైన చర్యలు తీసుకున్నారు. ఇప్పుడు కోర్టు సమన్లు జారీ కావడంతో ఈ వ్యవహారం రాజకీయంగా మరింత ప్రాధాన్యం సంతరించుకుంది.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also:

