Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
KBC ఫేమ్ తహశీల్దార్‌కు జైలు శిక్ష!

KBC ఫేమ్ తహశీల్దార్‌కు జైలు శిక్ష!

వార్త 3 months ago

KBC Fame Tehsildar Arrested: మధ్యప్రదేశ్‌లో ఒకప్పుడు 'కౌన్ బనేగా కరోడ్‌పతి (KBC)' షో ద్వారా పాపులర్ అయిన మహిళా తహశీల్దార్ అవినీతి కేసులో అరెస్ట్ కావడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.

వరద సహాయక నిధుల్లో జరిగిన రూ. 2.5 కోట్ల అక్రమాలకు సంబంధించి ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.ఒకప్పుడు నిజాయితీకి, విజ్ఞానానికి మారుపేరుగా నిలిచిన అధికారిణి ఇప్పుడు తీవ్రమైన క్రిమినల్ ఆరోపణలు ఎదుర్కోవడం గమనార్హం.

Read Also:Visakhapatnam crime: హోంగార్డు గోవిందరాజు అనుమానాస్పద మృతి!

కుంభకోణం నేపథ్యం

2021లో మధ్యప్రదేశ్‌లో సంభవించిన వరదల సమయంలో బాధితులకు అందజేయాల్సిన సహాయక నిధులను ఆమె తప్పుడు బ్యాంక్ ఖాతాలకు మళ్లించినట్లు ఆరోపణలు వచ్చాయి.ఈ స్కామ్ విలువ దాదాపు రూ. 2.5 కోట్లు ఉంటుందని అధికారులు ప్రాథమిక విచారణలో గుర్తించారు.

అరెస్ట్, విచారణ

గ్వాలియర్‌లోని ఆమె నివాసం నుంచి పోలీసులు గురువారం ఆమెను అదుపులోకి తీసుకున్నారు. కోర్టులో హాజరుపరిచిన అనంతరం ఆమెను శివపురి జైలుకు తరలించారు.ఈ కేసులో కేవలం ఆమె ఒక్కరే కాదు, ఇప్పటివరకు మొత్తం 22 మంది రెవెన్యూ అధికారులు, మరో తహశీల్దార్‌ను కూడా అరెస్ట్ చేశారు. మొత్తం 110 మందిపై ఎఫ్ఐఆర్ (FIR) నమోదైంది.

 KBC fame woman Tehsildar arrested Madhya Pradesh

అమితా సింగ్ తోమర్ ఈ కేసు నుంచి తప్పించుకోవడానికి గతంలో హైకోర్టు, సుప్రీంకోర్టులను ఆశ్రయించి ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నించారు. అయితే ఆమె అప్పీళ్లను కోర్టులు తిరస్కరించాయి. అప్పటి నుంచి ఆమె విధులకు గైర్హాజరవుతూ అజ్ఞాతంలో ఉన్నారు. విజయపూర్ తహశీల్దార్‌గా ఉన్న ఆమెను బుధవారం కలెక్టర్ అర్పిత్ వర్మ విధుల్లో నుంచి తొలగించారు. అనంతరం పోలీసులు ఆమె ఆచూకీ కనిపెట్టి గ్వాలియర్‌లో అరెస్ట్ చేశారు.

కేబీసీ ద్వారా దేశవ్యాప్త గుర్తింపు అమితా సింగ్ తోమర్ గతంలో అమితాబ్ బచ్చన్ హోస్ట్ చేసిన ‘కౌన్ బనేగా కరోడ్‌పతి(కేబీసీ)’ షోలో పాల్గొని రూ.50 లక్షలు గెలుచుకున్నారు. ఆ సమయంలో ఓ ప్రభుత్వ అధికారిణిగా ఆమె చూపిన ప్రతిభకు దేశవ్యాప్తంగా ప్రశంసలు దక్కాయి. అటువంటి ఆఫీసర్ ఇప్పుడు ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేసిన కేసులో జైలు పాలవ్వడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

రియల్‌మీ 16 5జీ వచ్చేస్తోంది: 7000mAh బ్యాటరీ!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha