Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
KCR అసెంబ్లీకి రావొచ్చు కదా.. కేటీఆర్ కు కాంగ్రెస్ కౌంటర్

KCR అసెంబ్లీకి రావొచ్చు కదా.. కేటీఆర్ కు కాంగ్రెస్ కౌంటర్

వార్త 2 weeks ago

KCR : తెలంగాణ రాజకీయాల్లో అసెంబ్లీ సమావేశాల చుట్టూ అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బిఆర్ఎస్ మధ్య తీవ్రమైన సవాళ్లు, ప్రతిసవాళ్లు నడుస్తున్నాయి. 'మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీకి వస్తే సీఎం రేవంత్ రెడ్డి తట్టుకోలేరు' అంటూ ఇటీవల కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ శ్రేణులు ఘాటుగా స్పందించాయి.

కేటీఆర్ మాటలే నిజమైతే కేసీఆర్ వెంటనే అసెంబ్లీకి రావాలని, రేవంత్ రెడ్డిని మరియు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని సభలోనే నిలదీయాలని సవాలు విసిరాయి. కాంగ్రెస్ పనైపోవడమే బిఆర్ఎస్‌కు కావాల్సింది అయినప్పుడు, కేసీఆర్ సభకు హాజరుకాకుండా ఎందుకు దూరంగా ఉంటున్నారని అధికార పార్టీ నాయకులు ప్రశ్నిస్తున్నారు.

హైదరాబాద్‌లో కాంగ్రెస్ ధర్నా: కేసీఆర్ రాజీనామాకు డిమాండ్

మరోవైపు ప్రజా సమస్యలపై అసెంబ్లీలో చర్చించకుండా సభకు గైర్హాజరవుతున్న కేసీఆర్ వైఖరిని నిరసిస్తూ కాంగ్రెస్ నేతలు పోరుబాట పట్టారు. శాసనసభకు రాకుండా బాధ్యతల నుంచి తప్పుకుంటున్న కేసీఆర్ తన ఎమ్మెల్యే పదవికి వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్‌లో ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ ధర్నా చేపట్టారు. ప్రజలు ఓట్లేసి గెలిపించినప్పుడు చట్టసభకు వచ్చి ప్రజల తరఫున మాట్లాడాల్సిన బాధ్యత ప్రతిపక్ష నాయకుడిపై ఉందంటూ, కేసీఆర్ అసెంబ్లీకి రాకపోవడం పట్ల ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తున్నాయని కాంగ్రెస్ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

డోర్నకల్-గద్వాల నూతన రైల్వే లైన్‌కు రైల్వే బోర్డు గ్రీన్ సిగ్నల్

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha