Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
KCR phone tapping: ట్యాపింగ్ కేసులో కేసీఆర్ నోటీసులు?

KCR phone tapping: ట్యాపింగ్ కేసులో కేసీఆర్ నోటీసులు?

వార్త 4 months ago

KCR phone tapping: తెలంగాణ రాష్ట్ర రాజకీయాలను కుదిపేస్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసు కీలక మలుపు తిరిగింది. ఈ కేసు దర్యాప్తు చేపట్టిన ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) ఇప్పటికే పలువురు కీలక నేతలను, అధికారులను విచారించగా, ఇప్పుడు తదుపరి దశపై ఆసక్తికర చర్చ జరుగుతోంది.

మాజీ మంత్రి హరీష్‌రావు, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, అలాగే సీనియర్ నేత సంతోష్‌రావులను ఇప్పటికే SIT ప్రశ్నించినట్లు సమాచారం.

ఇప్పుడీ కేసులో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కూడా విచారించే అవకాశం ఉందన్న ప్రచారం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. అధికారికంగా ఇప్పటివరకు నోటీసులు జారీ కాలేదన్నప్పటికీ, దర్యాప్తు పరిధి విస్తరిస్తున్న నేపథ్యంలో కేసీఆర్ పేరు తెరపైకి రావడం ప్రాధాన్యత సంతరించుకుంది.

ఇక అరెస్టయిన కొందరు పోలీసు అధికారులు విచారణలో సంచలన విషయాలు వెల్లడించినట్లు వార్తలు వస్తున్నాయి. తాము స్వయంగా నిర్ణయాలు తీసుకోలేదని, 'పైస్థాయి ఆదేశాల మేరకే ఫోన్ ట్యాపింగ్ చేశాం' అని వారు పేర్కొన్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఆ 'పైస్థాయి' అంటే ఎవరు? అన్న ప్రశ్న రాజకీయంగా పెద్ద చర్చకు దారి తీసింది.

ఈ ఆదేశాలు సీఎం కార్యాలయం (CMO) నుంచి వచ్చాయా? లేక కేసీఆర్‌కు అత్యంత సన్నిహితులుగా చెప్పుకునే వ్యక్తుల నుంచి వచ్చాయా? అనే కోణంలో SIT లోతైన విచారణ చేపట్టినట్లు తెలుస్తోంది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం రాష్ట్రంలో అధికార దుర్వినియోగానికి సంబంధించిన అంశమా? లేక వ్యక్తిగత నిర్ణయాల ఫలితమా? అన్నది తేలాల్సి ఉంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha