Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Singarenii workers welfare: సింగరేణి కార్మికులకు సొంత ఇల్లు: భట్టి

Singarenii workers welfare: సింగరేణి కార్మికులకు సొంత ఇల్లు: భట్టి

వార్త 4 months ago

Singarenii workers welfare: తెలంగాణ రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం సింగరేణి కార్మికుల సంక్షేమానికి అత్యున్నత ప్రాధాన్యత ఇస్తోందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పష్టం చేశారు.

సింగరేణి సంస్థను కార్మికుల భాగస్వామ్యంతో మరింత బలోపేతం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. కార్మికులకు అధికారులు పొందుతున్న సౌకర్యాలతో సమానమైన వసతులు కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.

సింగరేణి ఉద్యోగులు ఎదుర్కొంటున్న మారుపేరు (డిజిగ్నేషన్) సమస్యను త్వరలోనే పరిష్కరిస్తామని, ఈ అంశంపై ఇప్పటికే అధికారులతో చర్చలు జరుగుతున్నాయని భట్టి విక్రమార్క వెల్లడించారు. అలాగే మెడికల్ ఇన్‌వాలిడేషన్‌కు గురైన కార్మికుల సమస్యలను బోర్డు స్థాయిలో సమగ్రంగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

కార్మికుల సొంతింటి కలను సాకారం చేయాలనే ఉద్దేశంతో ఐఫోర్ కమిటీ కీలక నిర్ణయం తీసుకుందని, ఈ నిర్ణయంతో అనేక మంది సింగరేణి కార్మికులకు గృహ నిర్మాణ అవకాశం కలుగుతుందని తెలిపారు. ఇది కార్మికుల జీవితాల్లో ఆర్థిక స్థిరత్వాన్ని తీసుకురానుందని అన్నారు.

అలాగే దేశంలో ఎక్కడా లేని విధంగా సింగరేణి కార్మికులకు రూ.1.25 కోట్ల ప్రమాద బీమా సౌకర్యాన్ని ప్రభుత్వం అందిస్తోందని భట్టి విక్రమార్క వెల్లడించారు. ఈ బీమా పథకం కార్మిక కుటుంబాలకు భద్రతను, భరోసాను కల్పిస్తుందని పేర్కొన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha