Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
కేబీఆర్ పార్క్ చుట్టూ ₹1,090 కోట్లతో 'H-City' ప్రాజెక్ట్

కేబీఆర్ పార్క్ చుట్టూ ₹1,090 కోట్లతో 'H-City' ప్రాజెక్ట్

వార్త 1 week ago

Hyderabad H City Project: హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ ఇబ్బందులను తొలగించేందుకు తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన 'హెచ్-సిటీ' (H-City) ప్రాజెక్ట్ మరియు కేబీఆర్ పార్క్ పరిసరాల్లో అమలు చేయనున్న వన్-వే ట్రాఫిక్ నిబంధనలకు సంబంధించిన.

Read Also :Farmer Registry: నిజమైన రైతులకు మాత్రమే సబ్సిడీ ఎరువులు

పోలీస్ కమిషనర్ వి.సి. సజ్జనార్ కీలక ప్రకటన!

హైదరాబాద్ నగరంలో పెరుగుతున్న వాహనాల రద్దీకి శాశ్వత పరిష్కారం చూపేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ‘హైదరాబాద్ సిటీ ఇన్నోవేటివ్ అండ్ ట్రాన్స్‌ఫార్మేటివ్’ (H-City) ప్రాజెక్టును చేపట్టింది. అందులో భాగంగా కేబీఆర్ పార్క్ (KBR Park) చుట్టూ ఉన్న ఆరు కీలక కూడళ్ల వద్ద ₹1,090 కోట్ల వ్యయంతో 14 ప్రధాన మౌలిక నిర్మాణాలను చేపట్టనుంది. ఇందులో 7 మల్టీ లెవల్ స్టీల్ ఫ్లైఓవర్లు, 7 డైరెక్షనల్ అండర్‌పాస్‌లు ఉన్నాయి.

Hyderabad H City Project: ఆగస్ట్ 18 నుంచి వన్-వే ట్రాఫిక్!

ఈ నిర్మాణ పనులను వేగవంతంగా, అంతరాయం లేకుండా పూర్తి చేయడం కోసం ఆగస్ట్ 18 నుండి కేబీఆర్ పార్క్ చుట్టూ ఏకముఖ (వన్-వే) ట్రాఫిక్ విధానాన్ని అమలు చేయనున్నట్లు హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్ వి.సి. సజ్జనార్ వెల్లడించారు. సమగ్ర అధ్యయనాలు, ట్రయల్ రన్స్ మరియు జిహెచ్ఎంసి (GHMC) సమన్వయంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.

ఈ మల్టీ లెవల్ నిర్మాణాలు పూర్తయితే కేబీఆర్ పార్క్ ఎంట్రన్స్, రోడ్ నంబర్ 45, ఫిలింనగర్, మహారాజా అగ్రసేన్ మరియు క్యాన్సర్ హాస్పిటల్ జంక్షన్లలో 100 శాతం సిగ్నల్ ఫ్రీ రాకపోకలు సాగుతాయని సిపి తెలిపారు. అత్యధిక రద్దీ ఉండే జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ జంక్షన్ వద్ద 80 శాతం వరకు ట్రాఫిక్ సమస్యలు తగ్గుతాయి. దీనివల్ల ప్రయాణ సమయం తగ్గడంతో పాటు ఇంధనం ఆదా అయ్యి, వాయు కాలుష్యం తగ్గుతుందని పేర్కొన్నారు. ప్రాజెక్ట్ నిర్మాణ సమయంలో ప్రయాణికులు, స్థానిక నివాసితులు పోలీసు శాఖకు సహకరించాలని కోరారు.

కూకట్‌పల్లిలో అత్యధికంగా ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తులు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha