Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
కేజ్రీవాల్‌కు ఢిల్లీ హైకోర్టు షాక్.. కోర్టు ధిక్కరణ నోటీసులు జారీ

కేజ్రీవాల్‌కు ఢిల్లీ హైకోర్టు షాక్.. కోర్టు ధిక్కరణ నోటీసులు జారీ

వార్త 2 months ago

Arvind Kejriwal: ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) అధినేత, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు ఢిల్లీ హైకోర్టులో చుక్కెదురైంది. కోర్టు ధిక్కరణ చర్యలపై వివరణ కోరుతూ, జస్టిస్ స్వర్ణ కాంత శర్మ కోర్టు విచారణ వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేయడంపై హైకోర్టు తీవ్రంగా స్పందించింది.

కేజ్రీవాల్ వాదనలకు సంబంధించిన వీడియోలను అన్ని సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌ల నుంచి తక్షణమే తొలగించాలని కోర్టు ఆదేశించింది.

Read Also: Chhattisgarh Crime: భార్య తల నరికి, చేత్తో పట్టుకుని వీధుల్లో తిరిగిన భర్త!

కీలక వ్యాఖ్యలు

వివరాల్లోకి వెళితే.. జస్టిస్ ఎస్‌కే శర్మ (SK Sharma) నేతృత్వంలోని ధర్మాసనం ఎదుట ఓ న్యాయవాది వాదనలు వినిపిస్తున్న వీడియోను కేజ్రీవాల్ తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేశారు. సాధారణంగా న్యాయస్థానంలో విచారణల వీడియోలను అనుమతి లేకుండా బహిరంగంగా పంచుకోవడం కోర్టు నిబంధనల ఉల్లంఘన కిందకు వస్తుంది.

 Arvind Kejriwal Delhi High Court Notice

దీనిని తీవ్రంగా పరిగణించిన హైకోర్టు, కేజ్రీవాల్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ ఉదంతంపై విచారణ చేపట్టిన ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. కోర్టు గౌరవానికి భంగం కలిగించేలా వ్యవహరించినందుకు గాను, కోర్టు ధిక్కరణ చర్యలు ఎందుకు తీసుకోకూడదో స్పష్టం చేస్తూ నోటీసులకు సమాధానం ఇవ్వాలని పేర్కొంది.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

పెట్రోల్, డీజిల్ ధరలపై రూ. 25 పెంపు రుమౌర్స్ .. కేంద్రం స్పందన

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha