Jabalpur Boat Accident: మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌లో జరిగిన పడవ ప్రమాదం యావత్ దేశాన్ని కంటతడి పెట్టిస్తోంది. ప్రకృతి వైపరీత్యానికి తోడు మానవ తప్పిదాలు తోడై తొమ్మిది మంది ప్రాణాలను బలిగొన్నాయి.
ముఖ్యంగా సహాయక చర్యల్లో బయటపడ్డ ఓ దృశ్యం అక్కడి అధికారులను, స్థానికులను కలచివేసింది.
Read Also:Sithampeta Road Accident: సీతంపేట మండలంలో వేర్వేరు రోడ్డు ప్రమాదంలో ఐదుగురు గిరిజనులు మృతి
SDRF Rescue Operations
ప్రాణం పోయినా విడవని బంధం
శుక్రవారం సహాయక బృందాలు వెలికితీసిన మృతదేహాల్లో ఒక తల్లి, ఆమె నాలుగేళ్ల కుమారుడి ఆనవాళ్లు అందరినీ భావోద్వేగానికి గురిచేశాయి. మృత్యువు కౌగిట్లోకి వెళ్తున్న ఆఖరి క్షణంలో కూడా ఆ తల్లి తన బిడ్డను గుండెలకు హత్తుకునే ఉంది. ఆ ఇద్దరికీ కలిపి ఒకే ఒక్క లైఫ్ జాకెట్ ఉండటం అక్కడి భద్రతా వైఫల్యాలకు సజీవ సాక్ష్యంగా నిలిచింది.
Jabalpur Boat Accident: అసలేం జరిగింది?
జబల్‌పూర్‌లోని బార్గీ డ్యామ్ రిజర్వాయర్‌లో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
- ప్రమాద సమయం: గురువారం సాయంత్రం.
- కారణం: సుమారు 30 మందితో వెళ్తున్న క్రూయిజ్ బోటు ఒక్కసారిగా వచ్చిన తుపాను ధాటికి నీటిలో మునిగిపోయింది.
- సహాయక చర్యలు: SDRF మరియు స్థానిక పోలీసులు ఇప్పటివరకు 22 మందిని రక్షించగా, మృతుల సంఖ్య 9కి చేరింది.
బాధ్యులపై చర్యలకు ఆదేశం
ప్రమాద స్థలాన్ని సందర్శించిన రాష్ట్ర మంత్రి రాకేశ్ సింగ్ తల్లిబిడ్డల మృతదేహాలను చూసి కన్నీటి పర్యంతమయ్యారు. వాతావరణం అనుకూలించకపోయినా సిబ్బంది పడవను ముందుకు తీసుకెళ్లడమే కాకుండా, ప్రయాణికులందరికీ కనీసం లైఫ్ జాకెట్లు కూడా ఇవ్వలేదని ఆరోపణలు వస్తున్నాయి. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ బాధితులకు సానుభూతి తెలియజేస్తూ, ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని పర్యాటక శాఖను ఆదేశించారు.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also:

