Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
కేంద్ర మంత్రి బండి సంజయ్ తక్షణమే రాజీనామా చేయాలి.

కేంద్ర మంత్రి బండి సంజయ్ తక్షణమే రాజీనామా చేయాలి.

వార్త 3 months ago

Laxma Reddy: ఆయన కుమారుడి పై పోక్సో కేసు నమోదైతే పోలీసులు ఎందుకు అరెస్ట్ చేయట్లేదు? సీఎం,మంత్రులు ఎందుకు స్పందించడం లేదు..? హోం మంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలి.

బండి సంజయ్ కుమారుడు భగీరథ్ ను అరెస్ట్ చేసి బాధిత కుటుంబానికి న్యాయం చేయాలి.

Read Also:Bandi Bhagirath Case: బండి భగీరథ్ పై పోక్సో కేసు నమోదు.. ముందస్తు బెయిల్ కు యత్నం?

మాజీ మంత్రి డా.సి.లక్ష్మారెడ్డి గారు… కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు భగీరథ్ మైనర్ బాలికను అఘాయిత్యం చేసిన ఘటనలో పోలీసులు నిందితులపై చర్యలెందుకు తీసుకోవడం లేదని మాజీ మంత్రి డా.సి.లక్ష్మారెడ్డి గారు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.పోక్సో కేసు నమోదై 48 గంటలు గడుస్తున్నా భగీరథ్ ను అరెస్ట్ చేయకుండా కాపాడుతున్నారని మండిపడ్డారు.ఈ ఘటనలో పోలీసులు నిష్పక్షపాతంగా విచారణ చేసి బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.పోక్సో కేసు నమోదైతే పేద ప్రజలకు ఒక న్యాయం,అధికారం లో ఉన్న వారికి మరొక న్యాయం ఉంటుందా అన్నారు.కుమారుడిని రక్షించేందుకు బాధిత కుటుంబాన్ని కేంద్రమంత్రి బండి సంజయ్ భయబ్రాంతులకు గురి చేస్తున్నారని బాధితులకు రక్షణ కల్పించాల్సిన అవసరం ఉందన్నారు.అధికార దుర్వినియోగానికి పాల్పడిన కేంద్రమంత్రి సంజయ్ వెంటనే తన పదవీకి తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.ఈ ఘటనపై హోం మంత్రిగా ఉన్న సీఎం రేవంత్ రెడ్డి తో సహా,మంత్రులు స్పందించడంలేదన్నారు.

 Bandi Bhagirath POCSO case

Laxma Reddy: రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీల మధ్య ఉన్న చీకటి ఒప్పందానికి, కుమ్మక్కు రాజకీయాలకు ఈ ఘటన నిదర్శనమన్నారు.న్యాయం కోసం బాధిత కుటుంబం మూడు నెలలుగా తిరుగుతుంటే ఈ రాష్ట్రంలో పట్టించుకునే వారు లేరని మాజీ మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు.పోలీసులు భగీరథ్ ను వెంటనే అరెస్ట్ చేసి బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని మాజీ మంత్రి డా.సి.లక్ష్మారెడ్డి గారు డిమాండ్ చేశారు.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

బండి భగీరథ్‌ను అరెస్ట్ చేయాలని మహిళల నిరసన

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha